రాష్ట్రంలో కొత్తగా 2,273 కరోనా కేసులు.. 12 మంది మృతి

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,273 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,62,844 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి 12 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 996కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,260 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,31,447గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,401 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 23,569 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. మంగళవారం రాష్ట్రంలో 55,636 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 22,76,222 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 325, రంగారెడ్డి 185, నల్గొండ 175, మేడ్చల్ 164, వరంగల్ అర్బన్ 114, కరీంనగర్ 122, ఖమ్మం 97, సిద్ధిపేట్ 91, నిజామాబాద్ 91, మహబూబా బాద్ 57, కామారెడ్డి 68, సూర్యపేట్ 73, సంగారెడ్డి 58, భద్రాద్రి 56, యాదాద్రి 55, జగిత్యాల 50 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

డబుల్ బెడ్‌రూం పేరిట ఫేక్‌ అలాట్‌మెంట్‌ లెటర్స్‌.. ఫేక్ కీస్

ప్రాజెక్ట్‌పై రూ. 325 కోట్లు ఖర్చు పెట్టినా నేటికీ అందని నీరు

టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీలో భూ దందా!

Latest Updates