రాష్ట్రంలో మరో 2,534 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,534 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,50,176 కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం కరోనా బారినపడి 11 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 927కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,071 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,17,143గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,106 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 25,066 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటివరకు 54,169 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో బుధవారం 63,017 టెస్టులు చేయగా.. ఇప్పటివరకు 19,53,571 కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 327, రంగారెడ్డి 195, నల్గొండ 149, మేడ్చల్ 132, వరంగల్ అర్బన్ 124, కామారెడ్డి 123, ఖమ్మం 109, కరీంనగర్ 107, సిద్ధిపేట్ 103, సంగారెడ్డి 96, నిజామాబాద్ 90, సూర్యపేట్ 83, భద్రాద్రి 81, మహబూబా బాద్ 73, జగిత్యాల 65, మంచిర్యాల్ 64, నాగర్ కర్నూల్ 62, పెద్దపల్లి 58, రాజన్న సిరిసిల్ల 47 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

హెచ్​ఏఎల్​ లైట్‌‌‌‌ హెలికాప్టర్‌‌‌‌ ట్రయల్‌‌‌‌ సక్సెస్‌‌‌‌

టీ20లలోకి రీ ఎంట్రీ ఇస్తానంటున్న యువరాజ్!

వీడియో: రోహిత్ శర్మ సిక్స్ కొడితే.. స్టేడియం ముందు వెళ్తున్న బస్‌పై పడింది

Latest Updates