కొత్తగా 3 వేల స్టేట్‌‌‌‌బ్యాంక్ ఏటీఎంలు

ఢిల్లీ: స్టేట్‌‌ బ్యాంక్‌‌ కోసం మార్చి నాటికి 3 వేల ఏటీఎంలను ఏర్పాటు చేస్తామని సీఎంఎస్‌‌ ఇన్ఫో సిస్టమ్స్‌‌ ప్రకటించింది. బ్రౌన్‌‌ లెవెల్‌‌ ఏటీఎం(బీఎల్‌‌ఏ) సెగ్మెంట్‌‌లో ఉన్న సీఎంఎస్‌‌, ఈ ఏటీఎంల ఏర్పాటు కోసం రూ. 200 కోట్లను ఇన్వెస్ట్‌‌ చేయనుంది. అంతేకాకుండా వీటి మెయింటెనెన్స్ కోసం  2000 వేల మంది ఉద్యోగులను నియమించుకోనుంది.   కాగా, బ్రౌన్‌‌ లెవెల్‌‌ ఏటీఎం విధానంలో ఏటీఎంలను డైరక్ట్‌‌గా బ్యాంకులు కాకుండా సర్వీస్‌‌ ప్రొవైడర్లు మేనేజ్‌‌ చేస్తారు. సాధారణంగా ఇలాంటి ఏటీఎంలు బ్యాంక్‌‌ బ్రాంచులకు దూరంగా ఉంటాయి. 3,000 ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు ఎస్‌‌బీఐతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని సీఎంఎస్‌‌ ప్రెసిడెంట్‌‌ మంజునాథ్‌‌ రావు అన్నారు. ఈ అగ్రిమెంట్‌‌లో భాగంగా ఏటీఎంల ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కూడా సీఎంఎస్‌‌ సెలెక్ట్‌‌ చేస్తుంది. అంతేకాకుండా క్యాష్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ సర్వీస్‌‌లను, రెగ్యులర్ మెయింటెనెన్స్‌‌ను కంపెనీనే చూసుకుంటుంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఏటీఎంలను కలిపితే కంపెనీ మేనేజ్‌‌ చేస్తున్న మొత్తం బ్రౌన్‌‌ లెవెల్‌‌ ఏటీఎంలు 5 వేలకు చేరుకుంటాయి. కాంట్రాక్ట్ వ్యాలిడిటీ ఏడేళ్లు కాగా, మరో మూడేళ్ల వరకు పొడిగించుకునే అవకాశం ఉంది. కస్టమర్లు చేసే ట్రాన్సాక్షన్ల ద్వారా కంపెనీకి రెవెన్యూ అందుతుంది. వచ్చే 5 ఏళ్లలో ఈ బిజినెస్ ప్రాఫిట్‌‌లోకి వెళుతుందని రావు అన్నారు. ఏటీఎం మేనేజ్‌‌మెంట్‌‌ సర్వీస్‌‌లలో సీఎంఎస్‌‌కు పోటీగా ఏజీఎస్‌‌ ట్రాన్సాక్ట్‌‌, ఎస్‌‌ఐఎస్‌‌ ఉన్నాయి.

For More News..

వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్‌లో కీలక మైలురాయి

సతాయిస్తున్న బల్దియా సర్వర్లు.. పబ్లిక్ సర్వీసెస్‌కి బ్రేక్

బీసీసీఐ ఆస్తి రూ.14 వేల కోట్లు

Latest Updates