దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా 50 వేలకు తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36,469 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 488 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మొత్తం 79,46,429కు చేరగా..మృతుల సంఖ్య 1,19,502కు చేరింది. నిన్న ఒక్కరోజే 63,842 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ కేసుల సంఖ్య 72,01,070కు చేరింది. నిన్న ఒక్కరోజే 9,58,116 మందికి టెస్టులు చేయడంతో దేశంలో అక్టోబర్ 26 నాటికి కరోనా టెస్టుల సంఖ్య మొత్తం 10 కోట్ల 44 లక్షల 20 వేల 894కు చేరింది. ప్రస్తుతం దేశంలో 6,25,857 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

For More News..

రాష్ట్రంలో కొత్తగా 837 కరోనా కేసులు

ఆస్ట్రేలియా టూర్‌‌కు టీమిండియా ఎంపిక.. ఒక్క ఫార్మాట్‌కు ఎంపిక కాని రోహిత్ శర్మ

వరదల్లో పాడైన వాహానాలకు నో ఇన్సూరెన్స్

Latest Updates