ఈనెల 22న కొత్తగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీల ప్రమాణ స్వీకారం

రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖాయం చేశారు. దేశవ్యాప్తంగా వేర్వేరు పార్టీలకు చెందిన 61 మంది రాజ్యసభ సభ్యులు ఈ నెల 22వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజ్యసభ ఛాంబర్‌లో వీరి ప్రమాణ స్వీకారం జ‌ర‌గ‌నుంది. సాధారణంగా పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. ఈ సారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాజ్యసభ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

కొత్తగా 20 రాష్ట్రాల నుంచి ఎన్నికైన‌ 61 మంది రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార సమయంలో ఒకే ఒక కుటుంబ వ్యక్తి లేదా గెస్టుకు అనుమతినివ్వ‌నున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ ప్రకారం 67 మంది సభ్యులకు రాజ్యసభలో చోటు కల్పించే అవకాశం ఉంటుంద‌ని ఓ అధికారి తెలిపారు.

Latest Updates