కరోనాకు భయపడి పిల్లల్ని వద్దనుకుంటున్న కొత్త జంటలు

ఈ టైంలో పిల్లలు వద్దనుకుంటున్నరు
కరోనా ఎఫెక్ట్ తో కపుల్స్ లో భయం

అభద్రత, పెరిగిన ఖర్చులతో ఇంట్రస్ట్ చూపిస్తలేరు
ఫెర్టిలిటీ సెంటర్లకు వచ్చేవారు లేక వెలవెల
ఇప్పుడే వద్దంటూ కొత్త జంటలకు సజెస్ట్ చేస్తున్న డాక్టర్లు

“ బెంగళూరులో ఐటీ జాబ్ చేసే మహేశ్, సౌమ్యకు గతేడాది మ్యారేజ్ అయ్యింది. మొదట్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ వాయిదా వేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో సిటీకి ట్రాన్స్ ఫర్ అయ్యారు. దీంతో ఈ ఏడాది బిడ్డను కనేందుకు ప్లాన్ చేసుకుని గైనకాలజిస్టును సంప్రదించారు. డాక్టర్ సూచనలతో మెడికేషన్ కోర్సు ఫాలో అవుతున్నారు. ఇంతలోనే కరోనా వచ్చి పడింది. దీంతో వర్క్ ఫ్రం హోం కారణంగా సొంతూరు నిజామాబాద్ వెళ్లిపోయారు. ఇక ట్రీట్ మెంట్కు ప్రాబ్లమ్ అవుతుందని ప్రెగ్నెన్సీ ప్లాన్కు బ్రేక్ ఇచ్చారు.’’

హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్ పిల్లలు కనాలనుకునే దంపతులపైనా పడింది. రోజురోజుకు పెరుగుతున్న వైరస్ కేసులతో హాస్పిటల్స్ కు వెళ్లేందుకే జనాలు భయపడుతున్నారు. ఇక దంపతులు, కొత్త జంటలు ఏకంగా ప్రెగ్నెన్సీనే వాయిదా వేసుకుంటున్నాయి. పుట్టబోయే బిడ్డ, తల్లి ఆరోగ్యం దృష్ట్యా కొంతకాలం పాటు వద్దనుకుంటూ బ్రేక్ ఇస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో హాస్పిటల్స్ చుట్టూ తిరగడం కంటే వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత ప్లాన్ చేసుకోవడం బెస్ట్ అనుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. మెడికల్ హబ్ అయిన సిటీలో పిల్లలు కనేందుకు ఆశల పెంచుకున్నవారి కి ఎన్నో హాస్పిటల్స్ సేవలు అందిస్తున్నాయి. కొత్త జంటలు, ప్రెగ్నెన్సీ కోసం ఎదురుచూస్తూ ఉన్నవారితో గైనిక్, ఫెర్టిలిర్టి సెంటర్లు రద్దీగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం అవన్నీ వెలవెలబోయి ఉన్నాయి. మరోవైపు కొత్త కపుల్స్ ఇప్పుడే కన్సీవ్ కావొద్దని డాక్టర్లు సూచిస్తుండడంతో ప్రెగ్నెన్నీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.

వైరస్ ఫోబియా
కరోనా విజృంభణ తర్వాత చాలామందిలో వైరస్ ఫోబియా పట్టుకుంది. హాస్పిటల్స్ కు వెళ్లాలంటేనే జంకుతున్నారు. గర్భం వచ్చిన తర్వాత కామన్ గా శ్వాస కోశ ఇబ్బందులు, ఇమ్యూనిటీ ఇష్యూ, బ్లీడింగ్ వంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి. దీంతో పాటు ప్రతినెల మస్ట్ గా హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్స్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ ఓవైపు అయితే కరోనాతో ఫైనాన్షియల్ ప్లానింగ్ గాడి తప్పింది. నెలకొన్న అభద్రత, పెరిగిన అదనపు ఖర్చుల భారం వంటి వాటితో గర్భధారణకు ఇంట్రస్ట్ చూపిస్తలేరు. ఇప్పటికే ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజ్ లాంటి ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటున్నారు.

వాయిదా వేసుకోవడమే బెస్ట్
సిటీలో కరోనా తీవ్రతతో పిల్లలు కనేందుకు ప్లాన్ చేసుకునే దంపతులు ప్రస్తుతం వాయిదా వేసుకోవడమే బెస్ట్ అని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. తల్లిబిడ్డల హెల్త్ ను పరిగణలోకి తీసుకుని చాలావరకు ఓపీలు తగ్గించామని చెప్తున్నారు. గర్భిణులను నెలవారీ చెకప్ ల కోసం వద్దంటుండగా, పిల్లలను కనాలనే ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేసుకోమని సూచిస్తున్నట్లు విద్యానగర్ లోని నర్సింగ్ హోం డాక్టర్ సుమలత చెప్పారు. ప్రస్తుతం కరోనా తీవ్రత ప్రమాదకరంగా లేకున్నా, క్లిష్టంగా మారితే ఇరువురికి ప్రాబ్లమ్ గా మారుతుందనే దృష్టితోనే సలహా ఇస్తున్నామన్నారు. అయితే గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

73 శాతం మంది ఇప్పుడే వద్దనుకుంటూ..
కరోనా టైమ్ లో గర్భధారణ, ఆరోగ్య స్థితిగతులపై ‘జర్నల్‌ ఆఫ్‌ సైకో సోమాటిక్‌ రీసెర్చ్‌ గైనకాలజీ’ స్టడీ చేసి రిపోర్ట్ వెల్లడించింది. దేశంలోని పలు సిటీలకు చెందిన గైనకాలజిస్టులు, జంటలు చెప్పిన వివరాల ఆధారంగా ప్రెగ్నెన్సీ తో ఉంటే కరోనా సోకితే ఎలా అనే భయంతో 73 శాతం మంది పిల్లలు వద్దనుకుంటున్నట్లుగా తేలింది. ఇతర కారణాలతో వాయిదా వేసుకునేవారు కొందరైతే, సరైన ఏజ్లో ప్రెగ్నెన్సీ కాకపోతే పుట్టబోయే బిడ్డల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనే ఆందోళనలోనూ కపుల్స్ ఉన్నారు.

ఓపీ రద్దు చేశాం
కరోనా కారణంగా సిటీలోని మాబ్రాంచ్ లో జనరల్ ఓపీ రద్దు చేశాం. పిల్లలు పుట్టడం లేదనే ప్రాబ్లమ్ తో ఫెర్టిలిటీ సెంటర్లకు వచ్చేవారికి ఎమర్జెన్సీ అయితేనే అపాయింట్మెంట్ ద్వారా సేవలు అందిస్తున్నాం. సెంటర్ కు వచ్చేవారి సంఖ్య చాలా వరకు తగ్గింది.
‑సుభద్ర, ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు

కౌన్సిలింగ్ చేస్తున్నాం
కరోనా కారణంగా హాస్పిటల్స్లో ఓపీ సేవలు కూడాలేవు. గర్భిణులకు ఎమర్జెన్సీ అయితేనే రావాలంటున్నాం. మంత్లీ చెకప్ లను ఫోన్ ద్వారా సూచిస్తున్నాం. కొత్తగా పిల్లలను కనాలనుకున్న వారికి కౌన్సిలింగ్ చేస్తున్నాం. ‑ డాక్టర్ ప్రసన్నలక్ష్మి, గైనకాలజిస్ట్

For More News..

టిక్ టాక్ బ్యాన్ చేసిన అమెరికా

రైతు బీమాకు రూ.1,141 కోట్లు రిలీజ్

ఆన్‌లైన్ క్లాసుల కోసం స్టూడెంట్లకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం

Latest Updates