పెళ్లిలో వంట మాస్టర్ కు కరోనా.. క్వారంటైన్ కు నవదంపతులు

కరోనా వ్యాప్తికి ఎన్నికట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నా…ఏదో విధంగా…తెలియకుండా వైరస్ బారిన పడుతున్నారు ప్రజలు. ఎవరికి వైరస్ ఉందో..ఎవరి లేదో కనిపెట్టడం కూడా సాధ్యం కావడం లేదు. దీంతో తెలియకుండానే చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్న నవదంపతులు కరోనా సోకింది.

కర్ణాటకలోని తుముకూరు జిల్లా గుబ్బి గ్రామానికి చెందిన ఓ యువకుడి వివాహం ఇటీవల ఇంటి  దగ్గర నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లిలో వంట చేసిన మాస్టర్‌(55) కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. విషయం తెలిసిన అధికారులు వెంటనే అలర్టయ్యారు. కొత్త జంటతో పాటు వారి కుటుంబ సభ్యులు, పెళ్లికొచ్చిన అతిథులు కలిపి మొత్తం 56 మందిని క్వారంటైన్‌కు తరలించారు.

Latest Updates