ఉరి వేసుకొని నవవధువు ఆత్మహత్య

newly-married-woman-commits-suicide-in-old-malakpet-hyderabad

హైదరాబాద్: పెళ్లైన నెలరోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ మలక్ పేటలో జరిగింది. స్ధానిక సాయిబాబా నగర్ కాలనీలో నివాసముంటున్న లక్ష్మీ అనే వివాహిత చున్నీతో కిటికీకి ఉరి వేసుకొని  సుసైడ్ చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేటకు చెందిన లక్ష్మీకి గత నెల (ఏప్రిల్)17న, అదే జిల్లాకు చెందిన వనపర్తి వాసి చందు(30) తో వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత హైదరాబాద్ ఓల్డ్ మలక్ పేట లోని సాయిబాబానగర్ లో వారు కాపురం పెట్టారు.

రోజువారీ మెస్త్రీ పనులు చేసుకుంటూ దంపతులు జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది.  అసలు ఆమె ఎందుకు బలవన్మరణానికి పాల్పడిందో అర్థం కావడం లేదని కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు తెలిపారు.

ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి  చేరుకొని, కేసు నమోదు చేసుకొన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లక్ష్మీ తండ్రి పిర్యాదు మేరకు  ఈ కేసును  అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చాదర్ ఘాట్ ఎస్సై రాజశేఖర్  తెలిపారు.

Latest Updates