వార్తల్ని మనమే వడపోద్దాం

టీవీ చానెళ్లలో ప్రసారమయ్యే వార్తల​ విషయంలో సొంతగా నియంత్రణ పాటిస్తూ, దాని పర్యవేక్షణ కోసం కొత్త సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు న్యూస్​ బ్రాడ్​కాస్టర్స్​ ఫెడరేషన్​(ఎన్​బీఎఫ్​) తెలిపింది. కొత్తగా ఏర్పడబోయే సంస్థను ‘న్యూస్​ బ్రాడ్​కాస్టర్స్​ ఫెడరేషన్​ అథారిటీ(ఎన్​బీఎఫ్​ఏ)’ అనే పేరుతో, కొత్త ప్రమాణాలతో రూపొందించాలని నిర్ణయించింది. తొలిసారిగా 30కిపైగా నేషనల్​, రీజనల్ న్యూస్​ చానెళ్ల ప్రతినిధులు ఈమధ్యే ముంబైలో సమావేశమై ఈ మేరకు తీర్మానాలు చేశారు. న్యూస్​ ఇండస్ట్రీలో కంటెట్​ నియంత్రణ, సంస్థల నిర్వహణలో సమస్యలపైనా సమావేశంలో చర్చించారు. న్యూస్​ కంటెంట్ నియంత్రణపై గతంలో కేంద్ర ప్రభుత్వం గైడ్​లైన్లు రూపొందించిన నేపథ్యంలో ఎన్​బీఎఫ్​ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. మీటింగ్​కు హాజరైనవారిలో రిపబ్లిక్​ మీడియా సంస్థల చీఫ్​ అర్నబ్​ గోస్వామి, చెన్నైకి చెందిన ఫోర్త్​ డైమెన్షన్​ మీడియా సొల్యూషన్స్ సీఈవో బి.శంకర్​తదితురులున్నారు. వీ6 న్యూస్​తోపాటు పలు తెలుగు న్యూస్​ చానెళ్లూ ఎన్​బీఎఫ్​లో మెంబర్లుగా ఉన్నాయి.
ఫెడరేషన్​లో ఇంకొన్ని టీవీ చానెళ్లు, బ్రాడ్​కాస్టర్లు చేరేలా ఈనెల మొదటి నుంచి మెంబర్​షిప్ డ్రైవ్​ చేపడుతున్నట్లు, ఫెడరేషన్​ హెడ్​క్వార్టర్స్​ను ఢిల్లీలో ఏర్పాటుచేయనున్నట్లు ఎన్​బీఎఫ్​ ప్రకటించింది. 50కిపైగా నేషనల్​, రీజనరల్​ చానెళ్ల ప్రతినిధులతో ఈ ఏడాది జులైలో ఎన్​బీఎఫ్​ ఏర్పడ్డ సంగతి తెలిసిందే.

ఎన్​బీఎఫ్ఏ స్ట్రక్చర్​ ఇలా..

వార్తల ప్రసారంలో ఉన్నత ప్రమాణాలు పాటించేలా చూడటం ఎన్​బీఎఫ్​ ముఖ్య ఉద్దేశం.కొత్త అథారిటీలో ఒక చైర్మన్​, నలుగురు ఎడిటర్లు, ప్రముఖులుగా పేరుపొందిన నలుగురు ఇండిపెండెంట్లు ఉంటారు.

ఫెడరేషన్​లోని అన్ని సంస్థలు రూల్స్​ని సరిగా పాటించేలా, ఉల్లంఘనలు జరుగకుండా అథారిటీ చూసుకుంటుంది.దేశంలో, విదేశాల్లో వార్తలు ఎక్కువ మందికి చేరేలా వీక్షకుల సంఖ్యను పెంచుకోడానికి ఎన్​బీఎఫ్​ఏలో అంతర్భాగంగా డిస్ట్రిబ్యూషన్​ కమిటీ ఏర్పాటుచేస్తారు. ఆర్థిక కమిటీ ద్వారా సభ్య సంస్థలు.. కొత్త టెక్నాలజీ, లిక్విడిటీని మరింత బలోపేతం చేసుకునేలా సహాయపడతారు. అవసరాలకు అనుగుణంగా కొత్త కమిటీలు ఏర్పాటుచేసుకుంటారు.

 

 

Latest Updates