న్యూస్​పేపర్​ ప్రపంచాన్ని చూపిస్తుంది

ప్రపంచమంతా చుట్టి  వార్తల్ని మన ముందు ఉంచుతుంది న్యూస్​పేపర్​. కేవలం వార్తల్నే కాదు వింతలు, విశేషాల్ని కూడా చెప్తుంది. జనరల్​ నాలెడ్జ్​ని డబుల్ చేస్తుంది.. మెమరీ పవర్​ని పదింతలు పెంచుతుంది..మరీ ముఖ్యంగా స్టూడెంట్స్​ డైలీ న్యూస్​ పేపర్​ చదివితే  స్పీకింగ్​, రీడింగ్​ స్కిల్స్​ కూడా హైలో ఉంటాయి.. ఇవే కాదు రోజుకో గంట పేపర్​ చదివితే పిల్లలకి ఇంకా బోలెడు లాభాలున్నాయి.. అవేంటంటే..

పిల్లలు ఏదైనా నేర్చుకోవాలన్నా.. కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా.. వాళ్లకు ఎదుటివాళ్లు చెప్పాల్సిందే. అయితే అన్నిరకాల సమాచారాన్ని పిల్లలకు అందించడం ఇటు పేరెంట్స్​కి​, అటు టీచర్స్​కి సాధ్యం కాదు. అందుకే రాజకీయాలు, ఆటలు, పాటలు, సైన్స్​, సినిమా, కెరీర్ గైడెన్స్​..ఇలా అన్నింటినీ వివరంగా చెప్పే న్యూస్​ పేపర్లని వాళ్లతో చదివించాలి. న్యూస్​ పేపర్​ రెగ్యులర్​గా చదివే వాళ్లకి కరెంట్ ఎఫైర్స్​పై మంచి పట్టు ఉంటుందని కచ్చితంగా చెప్పొచ్చు. అందుకే పిల్లలకు స్కూల్​ ఏజ్​ నుంచే న్యూస్​పేపర్​ చదవడం అలవాటు చేయాలి.

ఒకప్పుడు న్యూస్​పేపర్​తోనే చాలామందికి రోజు మొదలయ్యేది. కానీ, ఇప్పుడు స్మార్ట్​ఫోన్​, కంప్యూటర్లలోనే న్యూస్​ పేపర్లని కూడా చదివేస్తున్నారు. దానివల్ల కంటి జబ్బులు, తలనొప్పిలాంటి ఆరోగ్య సమస్యలు రావొచ్చు. అందువల్ల పేపర్​ రీడింగ్​ని ఆన్​లైన్​ కాకుండా పేపర్​ ఇంటికి తెప్పించుకుని  చదవించడం మంచిది.

ఏ మీడియాలోనైనా ఫేక్​ న్యూస్​ ఉండొచ్చు ఒక్క న్యూస్​పేపర్​లో తప్ప అని చాలా సర్వేలు చెప్తున్నాయి. న్యూస్​ పేపర్​లో రాష్ట్రం.. దేశం.. ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ  ఉంటాయి. అంతేకాదు వినోదాన్ని అందించే పజిల్​ గేమ్స్​, సినిమా, స్పోర్ట్స్​ కాలమ్స్​ కూడా ఉంటాయి. ఇవన్నీ పెద్దలకే కాదు, పిల్లల్లో లోకజ్ఞానం పెరగడానికి ఎంతో ఉపయోగపడతాయి. కేవలం మెమరీ పవర్​ పెరగడమే కాదు, డైలీ  న్యూస్​పేపర్​ చదవడం వల్ల స్టూడెంట్స్​కి  ఇంకా బోలెడు లాభాలున్నాయి. అవేంటంటే.

రీడింగ్​ అండ్​ రైటింగ్​ స్కిల్స్..​

స్టూడెంట్స్​లో రీడింగ్​  అండ్​ రైటింగ్​ బాగా అలవర్చుకోవడానికి న్యూస్​పేపర్​ బాగా ఉపయోగపడుతుంది. అందుకే పిల్లలకి న్యూస్​ పేపర్​ అలవాటు చేయాలి.  రెగ్యులర్​గా న్యూస్​ పేపర్​ చదివితే  విషయాలపై అవగాహనతో పాటు  భాషపై పట్టు కూడా పెరుగుతుంది. పదాలు  రాయడం, చదవడం వస్తుంది. దాంతో స్కూల్లో కూడా సబ్జెక్ట్​ లెసన్​లను ఫాస్ట్​గా చదవగలుగుతారు.

ఎంటర్​టైన్​మెంట్​ అండ్​ స్పోర్ట్స్​ న్యూస్​ ..

రాష్ట్రాలు, దేశాల మధ్య జరుగుతున్న స్పోర్ట్స్​ ఈవెంట్స్​ గురించి పేపర్​లో ఉంటుంది. ప్రస్తుతం ట్రెండింగ్​లో గేమ్స్​, మ్యాచ్​ల గురించి కూడా తెలుస్తుంది. ప్లేయర్స్​ ఎవరున్నారు? ఏ ర్యాంకింగ్​లో ఉన్నారో కూడా స్టూడెంట్స్​కి అవగాహన వస్తుంది. ఇవన్నీ టీవీల్లో కనిపిస్తాయి.. కానీ ఒక్కసారి న్యూస్​పేపర్​లో చదివిన ఆర్టికల్స్​ని పిల్లలు అంత త్వరగా మర్చిపోలేరు. అంతేకాదు, పేపర్​లోని వార్తల ద్వారా నేషనల్​ ప్లేయర్ల టాలెంట్​ ఏంటో తెలుస్తుంది. స్కూళ్లలో ఆడే గేమ్స్​తో తమ ఫ్యూచర్​ని ప్లాన్​ చేసుకోవచ్చనే ఆలోచన వాళ్లలో వస్తుంది.​

జనరల్​ నాలెడ్జ్​కి బెస్ట్​ సోర్స్​ ..

రెగ్యులర్​ సబ్జెక్ట్స్​  లేదా కాంపిటేటివ్​ ఎగ్జామ్స్​లో సక్సెస్​ అవ్వాలంటే ఒక్క క్లాస్​రూమ్​ మాత్రమే సరిపోదు. సబ్జెక్ట్​తో పాటు జనరల్​ నాలెడ్జ్​ కూడా చాలా ముఖ్యం. న్యూస్​ పేపర్​ని జనరల్​నాలెడ్జ్​కి బెస్ట్​ సోర్స్​గా చెప్పొచ్చు. ఎందుకంటే న్యూస్​పేపర్​లో వచ్చే స్టడీ మెటీరియల్​, కోర్సులకు సంబంధించిన ఆర్టికల్స్​, రీసెంట్​ డిస్కవరీలు, కొత్తగా కనిపెట్టేవి.. ఇలా ఎన్నోరకాల విషయాలు ఉంటాయి. ఇవన్నీ స్కూల్​ బుక్స్​లో పిల్లలకు అందవు. ఈ మధ్య అన్ని పేపర్లు స్టూడెంట్స్​ కోసం ..స్పెషల్​గా స్టూడెంట్​ ఎడిషన్​ని అందిస్తున్నాయి. వాటిలో కోర్సులు, పోటీ పరీక్షలు, క్విజ్​లు, చదువు తర్వాత ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి.

పాలిటిక్స్​లో అప్​డేట్​ అవ్వొచ్చు ..

మనిషి అనేవాడు సంఘజీవి. అందువల్ల మన చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోవడం ముఖ్యం. పైగా ప్రస్తుతం ఏ పార్టీ గవర్నమెంట్​లో ఉన్నాం.. మంత్రులు, అధికారులు ఎవరో కూడా తెలుసుకోవాలి. ఇలాంటి వాటిని క్లాస్​రూముల్లో టీచర్లు ఎప్పటికప్పుడు అప్​డేట్​ చేయలేరు. అందువల్ల రెగ్యులర్​గా న్యూస్​పేపర్ చదువుతుంటే.. ఏ పదవిలో ఎవరున్నారు? వాళ్లు జనాల కోసం ప్రవేశపెడుతున్న స్కీమ్స్​ ఏంటో తెలుస్తుంది. మంచి లీడర్​ ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్నదానిపై కూడా స్టూడెంట్స్​కి అవగాహన వస్తుంది.

రీసెర్చ్​ అండ్​ ప్రాజెక్ట్​ ఐడియా ..

స్కూల్స్​, కాలేజీల్లో ఎన్నోరకాల ప్రాజెక్ట్స్​, రీసెర్చ్​లు చేయాల్సి ఉంటుంది. వాటిని కొత్తగా, క్రియేటివ్​గా చేయడానికి న్యూస్​పేపర్​ రీడింగ్​ చాలా ఉపయోగపడుతుంది. సైన్స్​, కరెంట్​ అఫైర్స్​పై అవగాహన ఉంటే, ఐడియాలు క్రియేటివ్​గా వస్తాయి. అందువల్ల ఎలాంటి సబ్జెక్ట్​లోనైనా ప్రాజెక్ట్​ చేసేందుకు రెడీగా ఉండగలుగుతారు. ఐడియాలు మాత్రమే కాదు, ఇంతకుముందు ఎవరో చేసిన డిస్కవరీలు, రీసెర్చ్​ ఆర్టికల్స్​ని న్యూస్​పేపర్​లో చదివి ఉంటారు కాబట్టి, ప్రాజెక్ట్​కి గైడ్​లైన్స్​ అందడం వల్ల ప్రాసెస్​ త్వరగా అవ్వచ్చు.

ఒకాబులరీ స్కిల్స్​ ..

స్టూడెంట్స్​ కోసం స్పెషల్​గా ఇచ్చే ఎడిషన్​లో ఎన్నోరకాల పజిల్స్​ ఉంటాయి. ముఖ్యంగా సుడోకు, వర్డ్​ పజిల్స్, రిడిల్స్​, టంగ్​ ట్విస్టర్స్​ స్టూడెంట్స్​ మెదడుకు పని చెప్తుంటాయి. అలాగే కొత్తకొత్త పదాలను పలకడం నేర్చుకుంటారు. పేపర్​ రీడింగ్​లో కూడా రోజుకో కొత్త పదం ఉచ్ఛారణని పిల్లలకు పేరెంట్స్​ నేర్పించాలి. తమకు అర్థం కాని పదాలను, పలకలేని మాటలు ఒక నోట్​బుక్​లో రాయమని చెప్పాలి. తర్వాత వాటిని పేరెంట్స్​ దగ్గరుండి పిల్లలకు నేర్పించాలి. ఇలా నేర్చుకున్న ఒకాబులరీ పిల్లలకు ఎస్సే రైటింగ్, అసైన్​మెంట్స్​, అకడమిక్​ ఎగ్జామ్స్​కి బాగా ఉపయోగపడుతుంది.

గుడ్​ స్పీకర్​ ..

న్యూస్​పేపర్ వల్ల స్టూడెంట్స్​కి​ అన్నిరంగాల విషయాలపైనా అవగాహన వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్​డేట్​ అవుతూ ఉంటారు. అందువల్ల స్కూల్​, ఇంటర్​స్కూల్​ ప్రోగ్రామ్స్​లో వాళ్లు మంచి స్పీకర్స్​గా మారతారు. అలాగే విషయ పరిజ్ఙానం ఉంటుంది కాబట్టి డిబేట్​, డిస్కషన్​ వంటి వాటిలో కాన్ఫిడెంట్​గా పాల్గొంటారు. పిల్లల్లో కాన్ఫిడెన్స్​, సబ్జెక్ట్​ పెరగాలన్నా, స్టేజ్​ ఫియర్​ పోవాలన్నా.. న్యూస్​పేపర్​ రీడింగ్​ని వాళ్లకు హాబీగా మార్చాలి. తెలుగు పేపర్లతో పాటు ఇంగ్లీష్​ పేపర్లు చదివించాలి. అప్పుడే నాలెడ్జ్​తో పాటు కమ్యూనికేషన్​ కూడా పెరుగుతుంది.

Latest Updates