న్యూజీలాండ్ తో మ్యాచ్ : పాకిస్థాన్ టార్గెట్ 238

బర్మింగ్ హామ్ : వరల్డ్ కప్ 2019 లో భాగంగా ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ కు 238 పరుగుల టార్గెట్ పెట్టింది న్యూజీలాండ్. టాస్ గెలిచిన న్యూజీలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. పాకిస్థాన్ బౌలర్లు ఆరంభంలో కివీస్ వికెట్లు టపటపా పడగొట్టి టెన్షన్ పెట్టారు. 46 రన్స్ కే 4 వికెట్లు, 83 రన్స్ కే 5 వికెట్లు కోల్పోయింది విలియంసన్ టీమ్. పీకల్లోతు కష్టాల్లో ఉన్న న్యూజీలాండ్ ను.. ఆల్ రౌండర్ నీషమ్(97 నాటౌట్), గ్రాండ్ హోమ్(64) ఆదుకున్నారు. ఆరో వికెట్ కు వీరిద్దరూ 132 రన్స్ జోడించారు. కెప్టెన్ విలయంసన్ 41రన్స్ తో రాణించాడు. 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 237 రన్స్ చేసింది న్యూజీలాండ్.

పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ షా ఆఫ్రిది 3, ఆమిర్ 1, షాదాబ్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.

Latest Updates