న్యూజీలాండ్ తో సెమీస్ : ఇండియా టార్గెట్ 240

మాంచెస్టర్ : ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో టీమ్ ఇండియా – న్యూజీలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ ఇవాళ ఉదయం కొనసాగింది. రెండోరోజుల పాటు జరుగుతున్న ఈ వన్డే మ్యాచ్ లో న్యూజీలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఇండియాకు 240 రన్స్ టార్గెట్ ను విసిరింది.

నిన్న వర్షం కారణంగా ఆగిన మ్యాచ్ ఇవాళ మొదలైంది. 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 రన్స్ తో ఇవాళ ఇన్నింగ్స్ కొనసాగించింది న్యూజీలాండ్. ఇవాళ 3.5 ఓవర్ల ఆట కొనసాగింది. మరో 3 వికెట్లు కోల్పోయి 28 రన్స్ జోడించింది కివీస్ టీమ్. మొత్తంగా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 రన్స్ చేసింది. ఇవాళ భువనేశ్వర్ 2 వికెట్లు, బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు.

ఓవరాల్ గా టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ 3 వికెట్లు, బుమ్రా, పాండ్యా, జడేజా, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.

Latest Updates