వన్ ప్లస్ 5జీ ఫోన్.. PUBG లవర్స్ కి స్పెషల్

స్పెయిన్: వన్ ప్లస్ మొబైల్ కంపెనీ ఈ ఏడాది ‘హై స్పీడ్’తో యూజర్ల ముందుకు రాబోతోంది. 5జీ టెక్నాలజీతో కొత్త ఫోన్ ను ఇంట్రడ్యూస్ చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి 28 వరకు స్పెయిన్ లోని బార్సిలోనాలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో ఆ కొత్త డివైజ్ ను ప్రపంచానికి పరిచయం చేయనుంది.

ఈ ఫోన్ PUBG లవర్స్ ని స్పెషల్ గా అట్రాక్ట్ చేయనుంది. 5జీ స్పీడ్ తో గేమ్ ను ఎంజాయ్ చేయొచ్చు. గేమ్ పార్ట్ నర్ తో కమ్యూనికేషన్ లో కూడా ఆలస్యం (లాటెన్సీ) ఉండదు. చిన్న టైమ్ గ్యాప్ కూడా లేకుండా ఆటలో డిష్యుం డిష్యుం కంటిన్యూ చేయొచ్చు.

క్వాల్ కమ్ 855 ప్రాసెసర్, 5జీ చిప్ సెట్ తో వస్తున్న వన్ ప్లస్.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న గేమింగ్ ఫోన్లకు పోటీ ఇస్తుందని టెక్ నిపుణులు అంటున్నారు. ఆసెస్ రోగ్, రేజర్ ఫోన్, షియామీ బ్లాక్ షార్ ఫోన్లకు ఇది దీటుగా నిలబడుతుందని అంటున్నారు.

Latest Updates