రోబోటిక్స్ లో ఫ్రీ కోచింగ్

వేసవి సెలవులు షురూ అయ్యాయి. నగర వ్యాప్తంగా సమ్మర్ క్యాంపుల సందడి మొదలైంది. అయితే ఓల్డ్ సిటీలోని న్యూ జనరేషన్ కంప్యూటర్ (ఎన్జీసీసీ) టెక్నాలజీ సెంటర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, కల్చల్ తో పాటు విద్యార్థులకు కంప్యూటర్ టెక్నాలజీపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. నేటి తరానికి ఉపయోగకరమైన రోబోటిక్స్ కంప్యూటర్స్పై పేద విద్యార్థు లకు ట్రైనింగ్ తో పాటు వారి లోని సృజనాత్మకతను వెలికితీస్తున్నారు.

స్కూళ్లకు రెండు నెలల పాటు సెలవులు రానున్నాయి. దాంతో తమ పిల్లలు వెకేషన్స్‌ పేరిటటైం వేస్ట్ చేయడాన్ని తల్లిదండ్రులు అసలు ఇష్టపడటం లేదు. క్లాస్మ్ చదివిన అంశాలే కాకుండా అదనపు అంశాలు నేర్చుకోవాలని పేరెంట్స్​ భావిస్తున్నారు. ఇదే చిన్నారులు ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్ తో వేసవిలో బిజీగా గడిపేయడానికి ప్రోత్సహిస్తోంది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తోంది చార్మినార్ లోని న్యూ జనరేషన్ కంప్యూటర్టెక్నాలజీ. పదిహేనేళ్లుగా వేలాది మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు ఈ సంస్థప్రతినిధులు. ‘మేకింగ్ స్కిల్ ఇండియా’ అనే నినాదంతో ఓల్డ్ సిటీకి చెందిన ఆమేథీ సిద్దిఖీ,అబ్దుల్ వాహాబ్ సిద్దిఖీ తమ సంస్థ ద్వారా విద్యార్థులకు రోబోటిక్, కంప్యూటర్ లోని జావా,గ్రాఫిక్ డిజైనింగ్, వీఎఫ్ఎక్స్ వంటి విభాగాల్లోఉచిత శిక్షణ ఇస్తున్నారు.

ప్రోత్సహిస్తే మరింత కృషి

వేసవి సెలవులోస్తే చాలు ఓల్డ్ సిటీలోని ఈసమ్మర్ క్యాంప్ కు ఏటా వేలాదిగా విద్యా ర్థులు వస్తుంటారు. నగరం నుంచే కాకుండా మహారాష్ట్ర, బెంగళూర్, యూపీతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యా ర్థులు వచ్చిసమ్మర్ క్యాంప్ లో పాల్గొంటారు. రోబోటిక్లోని రేస్, టు దిసన్, ఆటో అసెంబ్లీ, యాంటీడోట్, ట్రేనర్, ప్రోగ్రామింగ్ చాలెంజ్ వంటి అంశాల్లో 6 నుంచి 25ఏళ్ల లోపు వారికి కావాల్సిన శిక్షణ ఇస్తున్నారు. ఓల్డ్ సిటీలో టెక్నాలజీకు దూరంగా ఉండే విద్యా ర్థుల కోసమే ఎన్ జీసీసీ సంస్థ నెలకోల్పి కంప్యూటర్ టెక్నాలజీని అందిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.నిత్యం బ్యాచుల వారీగా 2 వేల మంది విద్యార్థులు ఆయా కంప్యూటర్​ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. నిరుపేద యువతకు కావాల్సిన సౌకర్యాలు అందిస్తూ ఇప్పటి దాకా అనేక మందికిఉద్యోగ అవకాశాలు కల్పిం చినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. తమ సంస్థకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తే చాలా మందికి రోబోటిక్, కంప్యూటర్ పై అవగాహన పెంపొందించేలా కృషిచేస్తామంటున్నారు

Latest Updates