రాహుల్ విమానంలో ఇంజిన్ ట్రబుల్ : సడెన్ ల్యాండింగ్

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణించిన విమానం ఇవాళ ఉదయం ట్రబుల్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం… ఇవాళ ఉదయాన్నే రాహుల్ గాంధీ.. బిహార్ రాష్ట్రానికి వెళ్లాలి. కానీ వెళ్లలేకపోయారు. ఢిల్లీలో ఆయన తన రెగ్యులర్ విమానం.. ఫాల్కన్ 2000 లగ్జరీ బిజినెస్ జెట్ లో పాట్నా బయల్దేరారు. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఇంజిన్ లో ట్రబుల్ వచ్చిన సంగతి పైలట్ గుర్తించాడు. వెంటనే ఫ్లైట్ ను ఢిల్లీకి తిప్పి అక్కడి ఎయిర్ పోర్టులో దించాడు.

ఈ సంగతిని ట్విట్టర్ లో చెప్పారు రాహుల్ గాంధీ. “పాట్నాకు వస్తున్న ఫ్లైట్ లో ఇంజిన్ సమస్య వచ్చింది. మేం అత్యవసరంగా మళ్లీ ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. బిహార్ లోని సమస్తీ పూర్, ఒడిషాలోని బాలాసోర్, మహారాష్ట్రలోని సంగంనేర్ లలో ప్రచారం ఆలస్యం అవుతుంది. మీ అసౌకర్యానికి క్షమిచండి” అని రాహుల్ గాంధీ ఓ పోస్ట్ పెట్టారు.

షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ పాట్నా ఎయిర్ పోర్టులో దిగి.. సమస్తీ పూర్ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన షెడ్యూల్ ఆలస్యమైంది.

రాహుల్ గాంధీ ప్రయాణించిన విమానంలో సాంకేతిక లోపం రావడం ఇది రెండోసారి. గతేడాది ఏప్రిల్ 26న .. ఢిల్లీ నుంచి కర్ణాటక హుబ్లీకి వస్తున్నప్పుడు కూడా విమానంలో టెక్నికల్ సమస్య వచ్చింది. కంప్యూటర్ పనిచేయలేదు. ఆ సమయంలో రాహుల్ ప్రయాణిస్తున్న విమానం.. భూమినుంచి 41వేల అడుగుల ఎత్తులో ఉంది. గాల్లో ఎత్తులో ఉన్న ఆ సమయంలో అందరూ భయపడ్డారు. కానీ ఆ తర్వాత సమస్య పరిష్కారం కావడంతో… అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

Latest Updates