ఏపీ ప్రభుత్వానికి రూ. 100 కోట్ల జరిమానా

NGT slaps rs 100 crore fine on AP government

ఢిల్లీ: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణానది ద‌గ్గ‌ర అక్ర‌మ ఇసుక ర‌వాణ చేసినందుకు గాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ).. ఆ రాష్ట్రానికి రూ.100 కోట్ల జరిమానా విధించింది. అమ‌రావ‌తిలోని సీఎం చంద్ర‌బాబు నివాసం స‌మీపంలో కృష్ణాన‌ది నుంచి రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు  అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని కేంద్ర మ‌రియు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎన్‌జీటీ కి నివేదిక ఇచ్చింది. అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని వాటర్ మాన్ రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. ఏపీ ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించింది.

Latest Updates