సంగమేశ్వరంపై తెలంగాణ వాదనలు వింటాం

సంగమేశ్వరంపై తెలంగాణ వాదనలు వింటాం

ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంగమేశ్వరం (రాయల సీమ) లిఫ్ట్‌ స్కీంపై తెలంగాణ సర్కారు వాదనలు వింటామని ఎన్‌జీటీ (చెన్నై బెంచ్‌) స్పష్టం చేసింది. 28న తెలంగాణ వాదనలు వినిపించాలని, అదే రోజు తీర్పునిస్తామని చెప్పింది. ఏపీ ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని.. ఆ ప్రాజెక్టుకు అనుమతుల్లేవని, దాన్ని ఆపాలంటూ నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ వేసిన పిటిషన్‌పై శుక్రవారం ఎన్‌జీటీ జ్యుడిషల్‌ మెంబర్‌ జస్టి స్‌ రాధాకృష్ణన్‌, టెక్నికల్‌ మెంబర్‌ సైబల్‌ దాస్‌ గుప్తా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపారు. ఈ నెల 11నే కేసులో వాదనలు ముగిసినట్టు ప్రకటించిన ఎన్‌జీటీ శుక్ర వారం తీర్పు వెలువరిస్తామంది.

ప్రాజెక్టును అడ్డు కోవాలనిచూస్తున్నరు: ఏపీ

ఏపీ ప్రాజెక్టుపై ఎన్‌జీటీ జాయింట్‌ కమిటీ రిపోర్టు తమకుఈ నెల 10న పంపారని, ఆ తర్వాతి రోజే విచారణ ఉండటంతో సమర్థంగా వాదనలు వినిపించలేకపోయామని ఎన్‌జీటీకి తెలంగాణ అడ్వొకేట్‌ శుక్రవారం తెలిపారు. జాయింట్‌ కమిటీ రిపోర్ట్‌ఏకపక్షంగా ఉందని, ఏపీ ప్రాజె క్టుతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వివరించారు. తమ వాదనను పరిగణలోకి తీసుకున్నాకే తుది తీర్పునివ్వాలని అభ్యర్థించారు. ఏపీ న్యాయవాది జోక్యం చేసుకుంటూ అప్లికెంట్‌ వేసిన కౌంటర్‌లోని వివరాలతోనే తెలంగాణ సర్కారు అప్లి కేషన్‌ దాఖలు చేసిందని, దాన్నిపరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. పిటిషనర్‌తో పాటు మరొకరు హైకోర్టులో పిటిష న్లు వేశారని, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసిందని, తమ ప్రాజెక్టును అడ్డుకోవాలనే ఇదంతా చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టులో జల వివాదం తప్ప పర్యావరణ అంశమేది లేదని, తీర్పునివ్వాలని కోరారు. కేసును రీ ఓపెన్‌ చేసి తమ వాదనను వినాల్సిం దేనని తెలంగాణ న్యాయవాది పట్టుబట్టారు.

కేసును రీ ఓపెన్‌ చేస్తే ఆల స్యమవుతుందని, అలాగే తెలంగాణ వాదనను వినకపోతే న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వెళ్లి నట్టు అవుతుందని పిటిషనర్‌ తరపున వాదనలు వినిపించిన అడ్వొకేట్‌ శ్రావణ్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ వాదనను పరిగణలోకి తీసుకొని కేసుపై త్వరగా డైరెక్షన్‌ ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు ఎన్విరాన్‌మెంట్‌ క్లియరె క్లి న్స్‌ అవసరమో లేదో చెప్పాలంటూ గతంలోనే కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖను బెంచ్‌ ఆదేశించిందని, కేంద్రం