మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు: దిశ తల్లిదండ్రులు

దిశ ఎన్ కౌంటర్ కేసులో రెండో రోజు విచారణలో భాగంగా దిశ తల్లిదండ్రులను విచారణకు హాజరవ్వాలని చెప్పింది జాతీయ మానవ హక్కుల కమీషన్ బృందం. ఇన్వెస్టిగేషన్ లో దిశ తల్లిదండ్రుల స్టేట్ మెంట్ ను రికార్డ్ చేయనుంది. ఇందుకోసం ఆదివారం మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని వారికి సమాచారం ఇచ్చింది. దీంతో శంషాబాద్ పోలీసులు… దిశ నివాసానికి చేరుకొని, పోలీస్ అకాడమీకి తీసుకువెళ్లనున్నారు. అయితే దిశ తల్లి ఆరోగ్యం సహకరించడం లేదని, NHRC  తమను ఇబ్బంది పెట్టకూడదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.  దిశ దినకర్మ రోజున పోలీసులు.. విచారణ పేరుతో కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని కాలనీ వాసులు కూడా వాదిస్తున్నారు.

అయితే.. వాస్తవాలు చెప్పేందుకు రావాలని పోలీసులు నచ్చజెప్పడంతో.. NHRC దగ్గరకు వెళ్లేందుకు అంగీకరించారు. దిశ తండ్రి, చెల్లిని పోలీస్ అకాడమీకి తీసుకెళ్లారు పోలీసులు.

ఉదయం గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి వెళ్లారు NHRC సభ్యులు. ఎన్ కౌంటర్ లో గాయపడి చికిత్స పొందుతున్న ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద గౌడ్ ను ప్రశ్నించి… వారి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు.

nhrc calls on disha parents to attend investigation trial

Latest Updates