పోలీస్ అకాడమీలో NHRC రహస్య విచారణ

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై రెండో రోజు విచారణ జరుపుతోంది జాతీయ మానవహక్కుల కమిషన్. ప్రస్తుతం పోలీస్ అకాడమీలో విచారణ జరుపుతోంది. నిందితుల కుటుంబాలను పోలీస్ అకాడమీకి గోప్యంగా తీసుకొచ్చి విచారిస్తున్నారు NHRC సభ్యులు.  నిందితుల కుటుంబాల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతకుముందు ఎన్ కౌంటర్ లో గాయపడి హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద గౌడ్ ను ప్రశ్నించింది NHRC టీం. వారి స్టేట్ మెంట్లను రికార్డ్ చేసింది. ఎన్ కౌంటర్ లో ఎస్సై వెంకటేశ్వర్లుకు కుడి నుదుటి భాగంలో, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ కుడి భుజానికి గాయాలయ్యాయి. వీటిపై NHRC టీం ఆరా తీసినట్టు సమాచారం.

NHRC holding second day of inquiry on Hyderabad Encounter

Latest Updates