తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై NHRC విచారణ

తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి నివేదిక సమర్పించింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్. 194 కాలేజీలను తనిఖీలు చేశామని అందులో లోపాలు ఉన్నాయని గుర్తించామని కమిషన్ కు బోర్డు తెలిపింది.  లోపాలున్న కాలేజీలకు కోటి 80 లక్షలకు పైగా జరిమానా విధించినట్లు నివేదిక ద్వారా చెప్పింది. అంతేకాదు అనధికారికంగా హాస్టల్ నడుపుతున్న కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు… సెలవు రోజుల్లో క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీలకు జరిమానా విధించినట్లు ఇంటర్ బోర్డు చెప్పింది. విద్యార్థుల సమస్యలపై తల్లిదండ్రులతో కాలేజీ యాజమాన్యాలు ఓరియంటేషన్ జరపాలని ఆదేశించినట్లు…జాతీయ మానవ హక్కుల కమిషన్ కు తెలిపింది ఇంటర్ బోర్టు. దీనిపై తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్.

Latest Updates