దిశ తండ్రి స్టేట్‌మెంట్ తీసుకున్న NHRC

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవహక్కుల కమిషన్ రెండో రోజు విచారణ ముగిసింది. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ జరిపారు NHRC సభ్యులు. NHRC  ఆదేశంతో అటు నిందితుల కుటుంబ సభ్యులు, ఇటు బాధితుల కుటుంబ సభ్యులను పోలీస్ అకాడమీకి తీసుకొచ్చారు పోలీసులు. నిందితుల కుటుంబాన్ని మధ్యాహ్నం విచారించిన NHRC వారి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది.

దిశ తండ్రి, చెల్లిని పోలీస్ అకాడమీకి తీసుకెళ్లారు పోలీసులు. దిశ కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్ కూడా తీసుకున్నారు NHRC సభ్యులు. దిశ ఫ్యామిలీతో పాటు.. వారి కాలనీ వాసులు కూడా NHRC దగ్గరకు వెళ్లారు. వారు కూడా దిశ ఇన్సిడెంట్ పై స్టేట్‌మెంట్ ఇచ్చారు.

అనంతరం దిశ తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం తమను అరగంట పాటు విచారణ జరిపిందని అన్నారు. ఎన్ కౌంటర్ గురించి ఎలాంటి ప్రశ్నలు  అడగలేదని, దిశ కనిపించకుండా పోయిన సమయంలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు గురించి అడిగారని, ఫిర్యాదు పట్ల పోలీసుల వ్యవహార శైలి గురించి అడిగారన్నారు. దిశ సంఘటన ఎలా జరిగిందని, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ఇలా అన్ని వివరాలు అడిగి తమ స్టేట్ మెంట్స్ ను రికార్డ్ చేశారన్నారు. అయితే తాము దిశ చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని అడిగిన  ప్రశ్నకు వారు ఎలాంటి సమాధానం చెప్పలేదన్నారు దిశ తండ్రి.

NHRC records statement of Disha's father and Sister

Latest Updates