హైదరాబాద్ శివారులో NIA సోదాలు

హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లి పరిధిలోని కింగ్స్ కాలనీలో సోదాలు నిర్వహిస్తున్నారు NIA అధికారులు. ఐసీస్ సానుభూతిపరులు ఉన్నారనే అనుమానంతో ఢిల్లీ నుంచి వచ్చిన 4 బృందాలు… తనిఖీలు కొనసాగిస్తున్నాయి. స్థానిక టాస్క్ ఫోర్స్ పోలీసులు, NIA సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితం అరెస్ట్ చేసిన బాసిత్ ఇచ్చిన వివరాలతోనే తనిఖీలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది.

2018 ఫిబ్రవరిలో ఉగ్రవాది అబ్దుల్‌ బాసిత్‌ను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. అబుదాబి ఐసీస్‌ మాడ్యూల్‌ కేసులో అబ్దుల్‌ బాసిత్‌పై ఛార్జీషీటు నమోదైంది. అబుదాబిలో ఐసిస్‌ తరపున కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు బాసిత్‌పై ఛార్జీషీటు నమోదైంది. మరికొందరితో ఐసీస్‌తో సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడి కావడంతో హైదరాబాద్ లో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

Latest Updates