హైదరాబాద్ లో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నఎన్ఐఏ

హైదరాబాద్ లో ముగ్గురు యువకులను ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్ సానుభూతిపరులనే సమాచారంతో ఎన్ఐఏ  పోలీసులు నగర శివారు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాస్త్రి పురంలో  ఓ యువకుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు పోలీసులు.  కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుని ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. మైలార్‌దేవ్‌పల్లితో పాటు మరో ఆరు ప్రాంతాల్లో  సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ పోలీసులు మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

ఐసిస్ ఉగ్రవాది అద్నాన్‌తో నిత్యం చర్చలు జరిపిన బాసిత్‌ 2018లో  అరెస్ట్ అయ్యాడు. అబ్దుల్ బాసిత్ ఇచ్చిన సమాచరంతోనే ఎన్ఐఏ పోలీసులు శనివారం నగర శివారు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాస్త్రి పురం, అలాగే మరో ఆరు ప్రాంతాల్లో  సోదాలు నిర్వహించారు.

Latest Updates