నకిలీ కరెన్సీని దొంగిలించి అరెస్టయిన కానిస్టేబుల్

అసలు అనుకొని నకిలీ కరెన్సీని దొంగలించి ఓ కానిస్టేబుల్ అడ్డంగా బుక్కయ్యాడు. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కి చెందిన ఓ కానిస్టేబుల్ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని NIA ఆఫీస్ లో గతవారం ఈ చోరి జరిగింది. ఈ  చోరీ ఘటనపై హోం మినిస్ట్రీ అధికారులు మాట్లాడుతూ..  “ఆఫీస్ లో ఉన్న స్టోర్ రూమ్ లోకి ఏసీ వెంటిలేటర్ ద్వారా చొరబడిన ఆ కానిస్టేబుల్ ఆ గదిలో ఉన్న నకిలీ సొమ్మును దొంగిలించాడు. అది నిజమైన కరెన్సీ అనుకొనే ఓ ప్యాంట్రీ స్టాఫ్ తో కలసి ఈ చోరీ చేశాడు. చోరి జరిగిన విషయాన్ని గుర్తించి ఆ కానిస్టేబుల్ తోపాటు అతనికి సహయపడిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశాం. వారిద్దరిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారని” తెలిపారు.

Latest Updates