బెంగళూరులో IED బాంబులను స్వాధీనం చేసుకున్న NIA

నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (NIA) అధికారులు బెంగళూరులో పలు ప్రాంతాలనుంచి ఇంప్రొవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజవ్‌ డివైజ్‌ (IED) లను స్వాధీనం చేసుకున్నారు. జమాత్‌ ఉల్‌ ముజాహిదీన్‌ బంగ్లాదేశ్‌ (JMB) ఉగ్రవాది మొహమ్మద్‌ జహీదుల్‌ ఇస్లాం ఇచ్చిన సమాచారంతో బెంగళూరులోని అటిబెలె, కడుగొడి, కెఆర్‌ పురం తదితర ప్రాంతాలనుంచి IED లను, వాటిని తయారు చేయడానికి అవసరమైన పరికరాలను, వైర్లను, బ్యాటరీలను కెపాసిటర్లు, స్విచ్‌లు మొదలైన వాటిని NIA అధికారులు స్వాధీనం చేసుకున్నారు. NIA అరెస్టు చేసిన మొహ్మద్‌ జహీదుల్‌ ఇస్లాం అలియాస్‌ కౌసర్‌ అలియాస్‌ మున్నా అలియాస్‌ మీజాన్‌ అలియాస్‌ బోమా మియాను ప్రశ్నించినప్పుడు దీనికి సంబంధించిన వివరాలు చెప్పాడు. భారత్‌లోని బుర్ద్వాన్‌లో జరిగిన పేలుళ్ల కేసుతో సహా బంగ్లాదేశ్‌లో జరిగిన పలు ఉగ్రవాద కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు మొహ్మద్‌ జహీదుల్‌ ఇస్లాం.

 

Latest Updates