రాత్రి 8కే ఐపీఎల్ మ్యాచులు

IPL 2020 మ్యాచ్ లు రాత్రి 8గంటలకే ప్రారంభమవుతాయన్నారు BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.  ఐపీఎల్ ఫైనల్ ముంబైలో జరుగుతుందని… అహ్మదాబాద్‌లో కాదని తెలిపారు గంగూలీ.  IPL నైట్ గేమ్స్ టైమింగ్‌లో ఎటువంటి మార్పు ఉండదని.. ఇంతకుముందు మాదిరిగానే మ్యాచ్ లు రాత్రి 8 గంటల నుండి ప్రారంభమవుతాయన్నారు. ఈసారి కేవలం ఐదు రోజులే రెండు మ్యాచ్ లు (సాయంత్రం 4, రాత్రి 8) ఉంటాయన్నారు. అంతేకాదు ఇకపై నోబాల్‌ను మూడో అంపైర్‌ నిర్ణయిస్తారని చెప్పారు.IPL 2020 ఫైనల్ ముంబైలో మే 24న జరుగుతుందని గంగూలీ స్పష్టం చేశారు.