సిటీలో మళ్లీ మొదలైన నైట్ లైఫ్

నైట్ లైఫ్ ఫిర్​ షురూ

అందుబాటులో డ్రైవ్ ఇన్స్, స్ట్రీట్ ఫుడ్

నైట్ అవుట్స్ కి వెళ్లేందుకు సిటిజన్ల ఇంట్రెస్ట్

హైదరాబాద్, వెలుగు: నిద్రపోని నగరం హైదరాబాద్ సిటీ. ఎప్పుడు ఏదో ఒక ఆక్టివిటీతో బిజీబిజీగా  ఉంటుంది. కానీ లాక్ డౌన్ తో దాదాపు 6నెలలుగా సిటీలో  నైట్ లైఫ్ కనుమరుగైపోయింది. కోవిడ్ 19 కారణంగా పబ్​లు, క్లబ్ లు, ఈవెంట్స్, డ్రైవ్ ఇన్స్, స్ట్రీట్ ఫుడ్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. కరోనా వైరస్ భయంతో జనం ఇంటి నుంచి బయటకు రావడమే మానేశారు. కానీ అన్ లాక్ తో మళ్లీ సిటీ నైట్ లైఫ్​షురూ అయిపోయింది. పబ్ లు, క్లబ్ లు మినహా అన్నీ ఓపెన్ అవడంతో జనం నైట్ లైఫ్ ని తిరిగి ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో సిటీలోని డ్రైవ్ ఇన్ కెఫేలు, స్ట్రీట్ ఫుడ్ పాయింట్ లు బిజిబిజీగా కనిపిస్తున్నాయి.

నైడ్ రైడ్స్​తో  ఎంజాయ్​

సిటీలో మిడ్ నైట్ కూడా డే లాగే ఉంటుంది. రోడ్లపై తిరుగుతున్న జనం, ఆక్టివిటీస్ అంతా పగలు, రాత్రి ఒకేలా ఉన్నట్టు కనిపిస్తాయి. ముఖ్యంగా చాలామంది నైట్ టైం బయటకు వెళ్లి తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సిటీలో కొన్ని ఏరియాలలో ఫేమస్ ఫుడ్ పాయింట్స్, మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ఐటీ కారిడార్స్ లో ఫుడ్ ట్రక్కుల దగ్గర ఎక్కువగా జనం కనిపిస్తుంటారు. అలాగే బర్త్ డే పార్టీలు, ఫ్రెండ్స్ తో చిల్ అయ్యేందుకు ఓపెన్ ప్లేస్ లనే ఎంచుకుంటూ ఉంటారు. అయితే కరోనా వైరస్, లాక్ డౌన్ తో సిటీలో 6నెలల నుంచి ఎలాంటి హ్యాపెనింగ్స్ జరగడం లేదు. కానీ మెల్లిమెల్లిగా అన్ని ఓపెన్ అయిపోతుండటం, అందరూ బయటకు వచ్చి పనులు చేసుకుంటుండంతో సిటిజనులు నైట్ టైం బయటకు వస్తున్నారు. ఇందులో భాగంగా చాలామంది లాంగ్ డ్రైవ్ లు,  నైట్ అవుట్స్ కి వెళ్తున్నారు. నెక్లెస్ రోడ్, దుర్గంచెరువు, ట్యాంక్ బండ్ వంటి ఫేమస్ ప్లేస్ లలో ఎక్కువగా కనిపిస్తున్నారు.

డ్రైవ్​ ఇన్​​కు భలే క్రేజ్​

చాలామందికి మిడ్ నైట్ ఐస్ క్రీమ్ తినాలని ఉంటుంది. అందుకే నైట్ ఫుడ్ తిన్నాక ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో ఐస్ క్రీమ్ పార్లర్స్ కి, డ్రైవిన్స్ కి వెళుతుంటారు. అలాగే నైట్ టైంలో స్ట్రీట్ ఫుడ్ తినేవారు కూడా ఎక్కువే. సిటీలో పలు చోట్ల నైట్ టైంలో ఫుడ్ ట్రక్కులు, దోశ, స్నాక్ బండ్లు పెడుతుంటారు. అర్ధరాత్రి తర్వాత ఆయా ప్రాంతాల్లో ఫుల్ రష్ కనిపిస్తుంటుంది. అన్ లాక్ తో మళ్లీ ఫుడ్ ట్రక్కులు, తోపుడు బండ్ల సంఖ్య పెరిగింది. ఇన్ని రోజులు నచ్చిన ఫుడ్ ని మిస్ అయిన వారు ఇప్పుడు తెగ లాగించేస్తున్నారు. అన్ని క్యుజిన్స్ ఒకే చోట దొరికే ప్లేస్ అంటే డ్రైవిన్స్. సిటీలో డ్రైవిన్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. సొంత వెహికిల్ లో కూర్చుని ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. దీంతో చాలామంది డ్రైవిన్స్ కి క్యూ కడుతున్నారు. బిర్యానీ నుంచి ఇరానీ ఛాయ్ వరకు, ఐస్ క్రీమ్ నుంచి పాస్తా వరకు అన్ని ఒకే చోట దొరికే ప్లేస్ కావడంతో డ్రైవిన్ లకు రష్ ఎక్కువగానే ఉంటుంది. కోవిడ్ గైడ్ లైన్స్ కి అనుగుణంగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని ఫుడ్ సర్వ్ చేస్తున్నామని చెబుతున్నారు డ్రైవిన్ ల ఓనర్లు.

రీఫ్రెష్ గా ఉంది

లాక్ డౌన్ కు ముందు ఫ్యామిలీతో వీక్ లో కనీసం టూ టైమ్స్​అయినా నైట్ టైంలో డ్రైవిన్ కి వచ్చేవాళ్లం. వీకెండ్స్ లో బయటే డిన్నర్ ప్లాన్ చేసుకుని కారు లో తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్లం. కానీ లాక్ డౌన్ తో మొత్తం మారిపోయింది. ఇంట్లో ఉండటంతో చాలా బోరింగ్ గా అనిపించింది. ఇప్పుడు అంతా నార్మల్ అవుతోంది. కరోనా తగ్గకపోవడంతో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని బయటకు వెళ్తున్నాం. కొంచెం కొంచెం గా అంతా మాములు స్థితికి వస్తున్నందుకు హ్యాపీగా ఉంది.

– మధు, జూబ్లీహిల్స్

ఫ్రెండ్స్ తో మస్తీ స్టార్ట్ అయింది

మాములుగా అయితే వీకెండ్స్ లో నైట్ అవుట్ కి ఫ్రెండ్స్​తో కలిసి వెళ్తుంటాం. కానీ కరోనా తో బయటకు వెళ్లడం కాదు, కనీసం కలవడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఉండేది. నిజంగానే కరోనా వైరస్ తో కలిసి బతుకుతున్నాం. రీసెంట్ గా ఫ్రెండ్స్ అందరం కలిసి నైట్ రైడ్ కి కార్ లో వెళ్లాం. చాలా మంత్స్ తర్వాత కాబట్టి ఫుల్ గా ఎంజాయ్ చేశాం. దగ్గర్లోని డ్రైవ్ ఇన్ కి వెళ్లాం. డిజర్ట్స్ తిని, మిల్క్ షేక్స్ తాగి చాలా టైం స్పెండ్ చేశాం. ఆ రోజులు మళ్లీ గుర్తుకు వచ్చాయి.
– మహేష్ , మాదాపూర్

For More News..

ఆల్టర్నేట్​ రోడ్లు లేవు.. స్కైవే లేదు

వరంగల్​ వార్​కు పార్టీలు రెఢీ

కొండపోచమ్మ కట్టకు బుంగలు

Latest Updates