పంజాబ్ పై 28 పరుగుల తేడాతో… నైట్ రైడర్స్ విక్టరీ

సొంతగడ్డపై కోల్ కతా నైట్ రైడర్స్  వరుసగా రెండో విజయం సాధించింది. ఈడెన్  గార్డెన్స్  లో జరిగిన మ్యాచ్ లో 28 రన్స్ తేడాతో కింగ్స్  ఎలెవన్  పంజాబ్ ను చిత్తు చేసింది. టాస్  ఓడి ముందుగా బ్యాటింగ్  చేసిన కోల్ కతా జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 రన్స్ చేసింది. రాబిన్  ఉతప్ప 50 బంతుల్లో 67 రన్స్ చేసి నాటౌట్  నిలిచాడు. నితీశ్  రాణా 34 బంతుల్లో 63 పరుగులు చేయగా.. చివర్లో ఆండ్రీ రసెల్  చెలరేగిపోయాడు. కేవలం 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టి 48 రన్స్ చేశాడు.

రసెల్  వ్యక్తిగత స్కోరు 3 ఉండగా షమీ అద్భుత యార్కర్ తో క్లీన్ బౌల్డ్  చేశాడు. అయితే రూల్ ప్రకారం ఆ టైంలో 30 గజాల సర్కిల్ లో కనీసం నాలుగు ఫీల్డర్లు ఉండాల్సి ఉండగా ముగ్గురు మాత్రమే ఉన్నారు. దీంతో అంపైర్  నోబాల్ గా ప్రకటించడంతో రసెల్  బతికిపోయాడు. నితీశ్  రాణా కూడా దూకుడైన ఆటతో చెలరేగి నైట్ రైడర్స్ కు భారీ స్కోరు అందించాడు. అశ్విన్ , మన్ దీప్ సింగ్ బౌలింగ్  లో భారీ సిక్స్ లు కొట్టాడు. ఊతప్ప కూడా బౌండరీలతో ఆకట్టుకున్నాడు. పంజాబ్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ లెవన్ జట్టు..మొదట్లోనే రాహుల్, క్రిస్ గేల్, సర్ఫరాజ్ వికెట్లు కోల్పోయింది. దీంతో భారం మయాంక్, మిల్లర్ లపై పడింది. కాసేపు మిల్లర్ , మయాంక్  స్కోరును పరుగులు పెట్టించారు. 34 బంతుల్లో 58 రన్స్ చేసిన మయాంక్ ను చావ్లా బౌల్డ్  చేయడంతో జట్టు కష్టాల్లో పడింది. ఇక 40 బంతుల్లో 59 రన్స్  చేసినా మిల్లర్ .. చివరి వరకు నిలిచినా పంజాబ్ కు ఓటమి తప్పలేదు. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి పంజాబ్ 190 పరుగులు చేసింది. కొల్ కతా బౌలర్లు ఆండ్రూ రసెల్ రెండు వికెట్లు తీయగా..ఫర్గూసన్, పీయూష్ చావ్లా తలో వికెట్ తీశారు.

బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినా ఆండ్రూ రసెల్  కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Latest Updates