సూర్యకాంతం ట్రైలర్ : నాకు ఇండైరెక్ట్ గా ప్రపోజ్‌ చేశావ్‌.. ఎదవా

మెగా హీరోయిన్ నిహారిక నటించిన సూర్యకాంతం ట్రైలర్ రిలీజైంది. దగ్గుబాటి రానా చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ ను మంగళవారం రిలీజ్‌ చేశారు. ప్రణీత్ బ్రహ్మాండపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో నిహారిక సరసన రాహుల్ విజయ్ హీరోగా నటించాడు. నిమిషం 50 సెకన్లున్న ఈ ట్రైలర్ లో..  ‘నా పేరు అభి.. నా జీవితంలో ఓ సంఘటన జరిగింది..’ అంటూ వచ్చే హీరో డైలాగ్‌ తో ట్రైలర్‌ స్టార్ట్ అయ్యింది. ‘నాకు ఇండైరెక్ట్ గా ప్రపోజ్‌ చేశావ్‌.. ఎదవా..’ అని హీరోపై మండిపడ్డ నిహారిక.. తర్వాత ఆయనకే ఫోన్‌ చేసి మాట్లాడుతూ కనిపించింది. ఇద్దరి మధ్యలో నలిగే యువకుడిగా రాహుల్‌ విజయ్‌.. భిన్నమైన స్వభావం ఉండే క్యారెక్టర్‌ లో నిహారిక నటించినట్లు తెలుస్తోంది.  వరుణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ మూవీ మార్చి -29న రిలీజ్ కానుట్లు తెలిపింది సినిమా యూనిట్.

Latest Updates