ఒకే రోజున నితిన్, నిఖిల్ ల పెళ్లిళ్లు

యంగ్ హీరోలు నితిన్, నిఖిల్ సిద్ధార్థ ఒకే రోజున పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఏప్రిల్ 16న వీరిద్దరూ పెళ్లికొడుకులుగా మారనున్నారు. తన పెళ్లి కోసం నితిన్ దుబాయ్ వెళ్తుండగా.. నిఖిల్ మాత్రం హైదరాబాద్‌లోనే తన పెళ్లి జరుపుకోనున్నారు.

‘భీష్మ’ సినిమాతో భారీ హిట్ కొట్టిన నితిన్ ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. మరి కొన్ని రోజుల్లో అంటే ఏప్రిల్ 16న  నాగర్ కర్నూలుకు చెందిన షాలిని కందుకూరిని అతను పెళ్లి చేసుకోబోతున్నారు. దుబాయ్‌లో ఏప్రిల్ 15న నిశ్చితార్థం.. 16న కొద్దిమంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగబోతోంది. 21న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.

మరో యంగ్ హీరో నిఖిల్ భీమవరం కు డాక్టర్ పల్లవి వర్మని అదే రోజున(ఏప్రిల్ 16న) పెళ్లి చేసుకోబోతున్నాడు. జరిగింది.  ఫిబ్రవరి 1న గోవాలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. వివాహం ఏప్రిల్ 16న హైదరాబాద్‌లో జరగనుంది.

nikhil-nithiin-to-share-same-marriage-date

Latest Updates