నీలోజిపల్లి గ్రామస్తులు హౌజ్ క్యారైంటైన్ లో ఉండాలి

కరోనా వైరస్ ను అరికట్టేందుకు అధికారులు తీవ్ర చర్యలు చేపట్టారు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లిలో వైద్యాధికారులు ఇంటింటికీ తిరుగుతూ పరిస్థితి సమీక్షిస్తున్నారు. దీంతో ఏమైందో తెలియక ఆ గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన వ్యక్తులు కాశ్మీర్ గడ్డలో కూడా తిరిగారు. అయితే అదే సమయంలో నీలోజిపల్లికి చెందిన దాదాపు 31 మంది రైతులు కూరగాయలు అమ్మినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే… ఆ గ్రామంలో తిరుగుతూ పరిస్థితి సమీక్షిస్తున్నారు. గ్రామ ప్రజలు హౌజ్ క్యారైంటైన్ లో ఉండాలని సూచిస్తున్నారు. ఎవరూ ఇళ్లలోంచి రావద్దని… కూరగాయల అమ్మకాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతే కాదా గ్రామంలోని అందరికీ మెడికల్ చెకప్ చేపట్టారు వైద్య సిబ్బంది.

Latest Updates