పరమ చెత్తగా నిమ్మరసం తయారీ.. తాగేముందు జాగ్రత్త

అసలే ఎండాకాలం. మండే ఎండల్లో తిరిగి తిరిగి… అలసిపోయేవాళ్లు చల్లని నీళ్లో.. కూల్ డ్రింకో తాగాలనుకుంటారు. ఎక్కువమంది నిమ్మరసం తాగి రిలాక్సవుతుంటారు. నగరాలు, పట్టణాల్లో అయితే… వాడవాడ చౌరస్తాల్లో ఓ నిమ్మరసం బండి కనిపిస్తుంటుంది. నిమ్మరసం తాగితే.. అలసట నుంచి త్వరగా బయటపడి… ఉత్సాహం వస్తుంది కాబట్టి.. అందరూ లెమన్ జ్యూస్ తాగాలని ఇష్టపడుతుంటారు. కానీ.. నగరాల్లో కొందరు వ్యాపారులు… జనం అవసరాన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు.. కేవలం పైసలకోసం జనం ప్రాణాలతో ఆటలాడుతున్నారు. నిమ్మరసాన్ని దారుణమైన అపరిశుభ్ర పరిస్థితుల్లో కల్తీ చేసి తయారుచేస్తున్నారు.

ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్ లోని ఓ జ్యూస్ స్టాల్ పైన… నిమ్మరసాన్ని పరమ చెత్తగా తయారుచేస్తున్న వీడియో ఒకటి ఈ మధ్య వైరల్ అయింది. ఉత్త చేతులతో నిమ్మకాయలను పిండి… ఓవర్ హెడ్ ట్యాంక్ లోని వాటర్ ను అందులో కలిపి.. బకెట్లో చేతులు కడుక్కుని..  ఆ వాటర్ ను కూడా అందులోనే పోసి.. ఓ స్టీల్ డ్రమ్ములో నింపాడు తయారీదారుడు. వీడియో చూస్తేనే వికారం కలుగుతుంది. ఈ తతంగాన్నంతా దూరం నుంచి ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో వైరల్ కావడంతో.. ముంబై పోలీసులు, రైల్వే పోలీసులు అలర్టయ్యారు. ఆ జ్యూస్ సెంటర్ ను సీజ్ చేశారు. అంతేకాదు.. ముంబైలోని అన్ని స్టేషన్లలో… అన్ని జ్యూస్ స్టాల్స్ ను మూసేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు.

ఇంత దరిద్రంగా తయారుచేసే జ్యూస్, షర్బత్ నా మనం తాగేది అని జనం అవాక్కయ్యారు. నిల్వచేసిన లెమన్ జ్యూస్ ను కొనుక్కుని తాగటం కంటే… అక్కడికక్కడే ఫ్రెష్ గా తయారుచేయించుకుని తాగడం బెటర్ అంటున్నారు.

Latest Updates