బీహార్ లో ఘోర ప్రమాదం…9 మంది లేబర్స్ మృతి

పాట్నా : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది లేబర్స్ మృతి చెందారు. నౌగాచియా వ్దద ఓ బస్సు, ఇనుప రాడ్స్ లోడ్ తో వెళ్తున్న ట్రక్కు ను ఢీకొట్టింది. దీంతో ట్రక్కు సమీపంలోనూ ఓగుంతలో పడిపోయింది. ట్రక్కులో ప్రయాణిస్తున్న 9 మంది లేబర్స్ అక్కడికక్కడే చనిపోయారు. రాడ్స్ వారిపై పడటంతో భూమిలోకి కూరుకుపోయారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిలో 5 మందికి గాయాలయ్యాయి. బస్సు దర్బంగా నుంచి బంకా వెళ్తుండగా మార్గ మాధ్యలో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారి వద్ద లభించిన ఐడెంటిటీ కార్డుల ఆధారంగా వారంతా ఈస్ట్, వెస్ట్ చంపారన్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. ఐతే వీరు మైగ్రెంట్స్ లేబర్సా కాదా అన్నది తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ప్రమాదం పై బీహర్ సీఎం నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు.

Latest Updates