ఆ నర్సులు ఒకరికొకరు డెలివరీ చేసుకుంటారంటా!

పోర్టులాండ్ : ఆ హాస్పిటల్ లో నర్సులంతా గర్భవతులే. ఒక నెల తేడాతో ఓ ప్రైవేట్ హస్పిటల్ లో పని చేస్తున్న 9 మంది నర్సులు ఒకేసారి నెల తప్పారు. వీరంతా అమెరికా, పోర్టులాండ్, మైనేలిలోని ఓ హస్పిటల్  నర్సులు. హాస్పిటల్ డ్రస్‌ లో ఫోటోలకు ఫోజులిచ్చి ఫేస్‌బుక్‌ లో పోస్టు చేశారు. ఈ నర్సులందరూ ఒకే నెలలో డెలివరీ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. ఒకరికొకరు డెలివరీ చేసుకోవాలని నర్సులు ప్లాన్‌ చేసుకున్నారట.

ఇప్పటికే ప్రసూతి వార్డులో విధులు నిర్వర్తిస్తున్న వీరు.. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తమ ఆరోగ్యాలకు ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు ఆ హస్పిటల్ డాక్లర్లు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి. డెలివరీలు చేయాల్సిన నర్సులు ఒకేసారి డెలివరీ కాబోతున్నారన్నమాట అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలా జరగడం కూడా ఓ మెరాకిల్ అంటున్నారు.

Latest Updates