రివ్యూ: నిను వీడని నీడను నేనే

రన్ టైమ్: 2  గంటల 25 నిమిషాలు

నటీనటులు: సందీప్ కిషన్,అన్యా సింగ్,వెన్నెల కిషోర్,మురళీ శర్మ,పోసాని తదితరులు

సినిమాటోగ్రఫీ: పి.కె వర్మ

మ్యూజిక్: తమన్

మాటలు: కె.ఎల్ విజయ్ కుమార్

నిర్మాతలు: సందీప్ కిషన్,సుప్రియ కంచెర్ల

కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: కార్తీక్ రాజు

రిలీజ్ డేట్ : జులై 12,2019

కథేంటి?

అర్జున్ (సందీప్ కిషన్),మాధవి (ఆన్య) కొత్తగా పెళ్లైన జంట.ఓసారి కార్ లో బయటకెళ్లి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అవుతుంది.తర్వాత ఇద్దరూ ఇంటికొచ్చి అద్దంలో చూసుకుంటే వేరే మనుషులు కనిపిస్తారు.దాంతో భయపడిపోయిన ఇద్దరూ డాక్టర్ ను కన్సల్ట్ అవుతారు.అక్కడ ఎలాంటి నిజాలు తెలుసుకున్నారు?ఎందుకలా జరిగింది.? చివరకు ఏం అవుతుందనేది కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

సందీప్ కిషన్ బాగా చేశాడు.తనకు సూటయ్యే పాత్ర ఎంచుకొని దానికి న్యాయం చేశాడు.ఆన్యా సింగ్ అటు అందంగా కనిపించక పోగా,నటనతో కూడా మెప్పించలేకపోయింది.వెన్నెల కిషోర్ సీరియస్ పాత్రలో నటించాడు.కొన్నిసార్లు నవ్వించాలని చూసినా..వర్కవుట్ కాలేదు.డాక్టర్ పాత్రలో మురళీ శర్మ రాణించాడు.పోసాని కామెడీ పండలేదు.

టెక్నికల్ వర్క్:

తమన్ ఇచ్చిన పాటల్లో రెండు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఎఫెక్ట్ ఇచ్చాడు.సినిమాటోగ్రఫీ బాగుంది.ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా తీసారు.ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది.

విశ్లేషణ:

సందీప్ కిషన్ నటించిన హార్రర్ థ్రిల్లర్ ‘‘నిను వీడని నీడను నేనే’’ సినిమా ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.ఫస్టాఫ్ మొత్తం ఎంగేజింగ్ గా సాగుతుంది.నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ తో డైరెక్టర్ కార్తీక్ రాజు నడిపించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది.అయితే ఫస్టాఫ్ లో ఉన్నంత గ్రిప్పింగ్ సెకాండాఫ్ లో మిస్ అయింది..ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు కానీ..దానికి తగినట్టు గా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోలేదు.దాని వల్ల సెకండాఫ్ లో అసలు పాయింట్ మిస్ అయింది.అనవసరైన కామెడీ,సెంటిమెంట్ లతో కథను పక్కదారిపట్టించారు.. చివరికి సరిగా డ్రైవ్ చేయమని ఓ మెసేజ్ ఇచ్చి సింపుల్ గా తేల్చేసారు..ఇప్పటివరకు హార్రర్ థ్రిల్లర్ జానర్ లో రాని కాన్సెప్ట్ ఎంచుకోవడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్..ఓవరాల్ గా ఓ డిఫరెంట్ హార్రర్ థ్రిల్లర్ చూసిన ఫీల్ కలుగుతుంది.

Latest Updates