ట్రైలర్ అదిరింది.. ‘నిను వీడని నీడను నేనే’

‘నిను వీడని నీడను నేనే’… ఈ పాట వినగానే.. పాత సినిమాలో ఓ దెయ్యం గుర్తుకొస్తుంది. ఇప్పటికీ రాత్రి వేళ ఆ పాట వింటే.. చాలామందికి వణుకే. ఆ పాట పల్లవే టైటిల్ గా … తెలుగులో ఓ హారర్ సినిమాను ప్రకటించినప్పుడే ఆసక్తి రేపింది. మూవీ స్టిల్స్ కూడా బజ్ క్రియేట్ చేశాయి. ఇపుడు ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ కూడా మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తోంది.

సందీప్ కిషన్, వెన్నెల కిశోర్, అన్యాసింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ కలిసి నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ట్రైలర్ ఇవాళ విడుదలైంది.

హారర్,సస్పెన్స్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ కు రెస్పాన్స్ బాగుంది. కామెడీ, హారర్ జోనర్ లో రూపొందింది ఈ మూవీ. ట్రైలర్ కు పూర్తి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో సమ్ థింగ్ ఏదో ఉంది.. అనే టాక్ వస్తోంది. ట్రైలర్.. మూవీ ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ పెంచేసింది.

తమన్ మరోసారి తాను రీరికార్డింగ్ కింగ్ అనిపించుకున్నాడు. ఆర్ఆర్ కొత్తగా.. హారర్ సినిమాకు తగ్గట్టుగా ఉంది. పూర్వంలో జరిగిన కథకు యానిమేషన్ తో.. ట్రైలర్ కట్ ఇంట్రస్ట్ పెంచింది. జులై 12న నిను వీడని నీడను నేనే మూవీ రిలీజ్ అవుతుందని సోషల్ మీడియాలో సందీప్ కిషన్ ప్రకటించాడు.