అవన్నీ రూమర్స్..చరణ్ తో విభేదాల్లేవ్

అన్నీ పుకార్లే మంచైనా చెడైనా.. ఈ రోజుల్లో చాలావేగంగా పాకిపోతోంది. ఆ వార్తనిజమైతే ఫర్వాలేదు.. కాకపోతేనే సమస్యంతా. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా విషయంలో పుట్టుకొచ్చిన ఓ పుకారు.. జనంతో పాటు ఆ టీమ్ ని కూడా అయోమయంలో పడేసింది. ఈ చిత్రాన్ని రామ్‌ చరణ్‌, నిరంజన్‌రెడ్డి కలిసి నిర్మిస్తున్న సంగతితెలిసిందే. అయితే వాళ్లిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, రామ్‌ చరణ్‌ప్రాజెక్ట్​ నుంచి తప్పుకున్నాడని వార్తలువచ్చాయి. దాంతో మెగా అభిమానులు చాలా డిస్టర్బ్ అయ్యా రు. అయితే ఆవార్తలో ఎంతమాత్రం నిజం లేదని ప్రకటించారు నిరంజన్. రామ్ చరణ్‌ ప్రొడక్షన్ హౌస్ కి తమకి మధ్య ఎలాంటి విభే దాలూ లేవని, సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలోనూ కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన చెప్పడంతో ఈ పుకార్లకు చెక్ పెట్టినట్టయింది.

Latest Updates