వేలానికి నీరవ్ కార్లు..ఈ నెల 18న అమ్మకం

పంజాబ్‌ నేషనల్‌ బ్యాం కును మోసంచేసి విదేశాలకు పారిపోయిన నగల వ్యాపారినీరవ్ మోడీకి మరో ఎదురుదెబ్బ తగిలిం ది. పీఎన్‌ బీకి చెల్లించాల్సిన బకాయిలను వసూలు చేయడానికి ఇతడి 13 లగ్జరీ కార్లు,178 పెయింటింగ్స్‌‌ను వేలం వేయడానికి ప్రత్యేక పీఎంఎల్‌ ఏ కోర్టు దర్యాప్తు సంస్థలకు అనుమతించింది. వేలానికి రానున్న వాటిలో రోల్స్‌‌ రాయిస్‌ ఘోస్ట్‌‌, పోర్షే పనమేరా, రెండు మెర్సిడెస్‌ బెంజ్‌‌ కార్లు, మూడు హోండాకార్లు,ఒక టొయోటా ఫార్చునర్‌ , ఇన్నోవా తదితర కార్లు ఉన్నాయి. ఏప్రిల్‌ 18న ఆన్‌ లైన్‌ ద్వా రా వీటిని విక్రయించనుంది. వేలం వేయనున్నకార్లకు సంబంధించిన ధర, ఫోటోలు, కంపెనీ తదితర వివరాలను ఆన్‌ లైన్‌ లో పొందుపర్చనుంది. వీటిని అమ్మాల్సిన బాధ్యతను మెటల్‌ స్క్రాప్ ట్రేడ్‌ కార్పొ రేషన్ లిమిటెడ్ (ఎంఎస్‌ టీసీ)కి అప్పగిం చారు. కార్లు, పెయింటింగ్స్ వివరాలను, ఫొటోలను త్వరలోనే ఈ కంపెనీ వెబ్‌ సైట్లో అప్‌ లోడ్‌ చేస్తారు . వేలం నిర్వహిం చడానికి వారం రోజుల ముందే బిడ్డర్లు వీటిని పరిశీలిం చడానికి అనుమతి ఇస్తారు .బిడ్‌ గెలిచాక డబ్బు చెల్లిం చడానికి తగినంత గడువు ఇస్తారు . నీరవ్ మోడీకి చెందిన 68 పెయింటింగ్స్‌‌ను గత వారం ఐటీశాఖ వేలం వేయగా రూ.54.84 కోట్లు వచ్చాయి.

Latest Updates