మూడోసారి నీరవ్​కు బెయిల్ నిరాకరణ

లండన్(బ్రిటన్): ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీకి లండన్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. వెస్ట్ మినిస్టర్ కోర్టు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా, వరుసగా మూడోసారి నీరవ్​కు బెయిల్ నిరాకరించారు. పిటిషన్ విచారణకు మోడీని జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. 20 లక్షల పౌండ్లు సెక్యూరిటీ ఇస్తామని, లండన్​లోని ఫ్లాట్​లో నీరవ్ ఉంటారని, కోర్టు పెట్టే ఎలాంటి కండిషన్లకైనా సిద్ధమని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఇండియా తరఫు వాదనలు వినిపించిన క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్), నీరవ్​కు బెయిలివ్వొద్దని కోరింది. బెయిల్ కోసం ఆయన చూపుతున్న కారణాలు సరిగా లేవంది. సీపీఎస్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిలివ్వడానికి నిరాకరించారు. ఒకసారి బెయిలిస్తే నిందితుడు తిరిగి సరెండర్ అవుతాడన్న నమ్మకం కలగడంలేదని చెప్పారు.