అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 17 వరకు నీరవ్‌‌‌‌‌‌‌‌ మోడీకి రిమాండ్‌‌‌‌‌‌‌‌

లండన్‌‌‌‌‌‌‌‌: పంజాబ్‌‌‌‌‌‌‌‌ నేషనల్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌కు అప్పు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి లండన్‌‌‌‌‌‌‌‌ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌‌‌‌‌‌‌‌ మోడీ రిమాండ్‌‌‌‌‌‌‌‌ను అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 17వరకు పొడిగించారు. గురువారం వీడియో ద్వారా విచారణ జరిపిన లండన్‌‌‌‌‌‌‌‌లోని వెస్ట్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టు జడ్జి డేవిడ్‌‌‌‌‌‌‌‌ రాబిన్‌‌‌‌‌‌‌‌ సన్‌‌‌‌‌‌‌‌ ఈ విషయాన్ని చెప్పారు.

నీరవ్‌‌‌‌‌‌‌‌ను ఇండియాకు అప్పగించే విషయంపై వచ్చే ఏడాది మే 11 – 15 మధ్యలో విచారిస్తామని చెప్పారు. విచారణ కోసం ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టరీ(ఈడీ), సెంట్రల్‌‌‌‌‌‌‌‌ బ్యూరో ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌ (సీబీఐ) టీమ్‌‌‌‌‌‌‌‌లు లండన్‌‌‌‌‌‌‌‌ కోర్టుకు హాజరయ్యాయి. సౌత్‌‌‌‌‌‌‌‌ వెస్ట్‌‌‌‌‌‌‌‌ లండన్‌‌‌‌‌‌‌‌లోని వాండ్స్‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌ జైల్లో ఉన్న నీరవ్‌‌‌‌‌‌‌‌ మోడీ బెయిల్‌‌‌‌‌‌‌‌ కోసం ఇప్పటికి నాలుగు సార్లు కోరగా.. కోర్టు దాన్ని తిరస్కరించింది.

Latest Updates