వేలానికి నీరవ్ మోడీ ఖరీదైన కార్లు

Nirav Modi's 13 luxury cars up for auction

పంజాబ్ నేషనల్ బ్యాంక్  కుంభకోణం నిందితుడు నీరవ్ మోడీకి చెందిన 13 కార్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వేలం వేయనుంది. నీరవ్ కు చెందిన 13 లగ్జరీ కార్లలో రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌, పోర్షే పనమెరా, రెండు మెర్సిడెస్‌ బెంజ్‌,  టొయోటా ఫార్చూనర్‌, ఇన్నోవా, రెండు హోండా బ్రియోస్‌లున్నాయి. వీటిలో రూ .5 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కారును ఈడీ ముంబై లో వేలం వేసేందుకు ప్రకటించింది.  కేవలం కోటీ రూపాయలకే ఈ కారు వేలంలోలభించనుంది. ఈ వేలాన్ని ఆన్ లైన్ ద్వారా విక్రయించనున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తెలిపింది.

Latest Updates