కోర్టు ఆవరణలో పడిపోయిన నిర్భయ దోషి భార్య

నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన  అక్షయ్ ఠాకూర్  భార్య పునీతా దేవి పటియాల కోర్టు ఆవరణలో  ఇవాళ సృహ తప్పి పడిపోయింది. తన భర్త నుంచి విడాకులు కావాలంటూ బీహార్ కోర్టులో పిటిషన్ వేసింది. ‘అత్యాచారం కేసులో నా భర్తను దోషిగా తేల్చి అతనికి ఉరిశిక్ష విధించారు. కానీ నా భర్త నిర్దోషి. రేప్ కేసులో ఉరితీసిన దోషి భార్యగా నేను ఉండదల్చుకోలేదు’ అని విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ పెండింగ్ లో ఉంది.

నిర్భయ దోషులను రేపు (మార్చి20) ఉదయం 5.30 కి ఉరి తీయనున్నారు. మరో వైపు  పవన్ గుప్తా వేసిన క్యురేటివ్ పిటిషన్ ను ఇవాళ సుప్రీం కోర్టు కొట్టివేసింది.

see more news

వాళ్లు కరీంనగర్ ఎందుకొచ్చారో ఎంక్వైరీ చేయండి

ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మెడికల్ స్టూడెంట్స్ మృతి

ఓపెన్ ప్లేస్ లో ఉమ్మితే రూ.1000 ఫైన్

Latest Updates