ఉరికొయ్యకు వేలాడనున్న నిర్భయ దోషులు

నిర్భయ దోషులకు ఉరి ఖరారు

ప్రపంచ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ హత్యకేసు దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. ఈనెల 16వ తేదీ ఉదయం 5గంటలకు తీహార్ జైల్లో నిందితులను ఉరి తీయనున్నారు. నిర్భయ సంఘటన జరిగి దాదాపు ఏడేళ్లు గడిచాయి. ఇప్పటికే నిందితులు అన్ని న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరిగా రాష్ట్రపతి క్షమాబిక్ష కోసం ప్రయత్నించారు. రాష్ట్రపతి తిరస్కరించడంతో ఈ నెల 16వ తేదీన ఉరిశిక్షను అమలు చేయాలని నిర్ణయించింది.

క్షమాభిక్ష పటిషన్లను రిజక్ట్ చేసిన రాష్ట్రపతి, కేంద్రప్రభుత్వం..?

నిర్భయ కేసు నిందితుల కేసు 2012డిసెంబర్ నుంచి 2019 సుమారు ఏడు సంవత్సరాలైన నిందితులకు మరణశిక్ష అమలు కాలేదు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం కేంద్రహోంశాఖ నిర్భయ కేసులో ప్రధాన ముద్దాయి వినయ్ శర్మ క్షమాభిక్షను కేంద్ర ప్రభుత్వ రిజక్ట్ చేస్తూ రామ్ నాథ్ కోవింద్ కు రికమండ్ చేసింది.

నిర్భయ కేసులో నిందితులు

నిర్భయ కేసులో ఆరుగురు నిందితులు రామ్ సింగ్(33), ముకేష్ సింగ్(24), , వినయ్ శర్మ(22), పవన్ గుప్తా(20) , అక్షయ్ ఠాకూర్(29), మరో మైనర్ నిందితుడు మహ్మద్ అఫ్రోజ్(17సంవత్సరాల 6నెలలు). నిర్భయ నిందితుల్లో మైనర్ అఫ్రోజ్ మైనర్ కావడంతో జువైనల్ కోర్ట్  మూడు సంవత్సరాల జైలుశిక్షతో భయటపడ్డాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ 2013మార్చ్ 11న తీహార్ జైల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులైన ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ లకు ఉరిశిక్షే సరైందని ట్రయల్ కోర్ట్, హైకోర్ట్, సుప్రీం కోర్ట్ లు సైతం తీర్పునిచ్చాయి.

ఎప్పుడో ఉరితీయాల్సింది…!

కోర్ట్ లు నిందితుల్ని ఉరితీయాలని తీర్పిచ్చాయి. అయితే నిందితులు తమకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ స్టేట్ గవర్నమెంట్, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడంతో కేసు విచారణ ఆలస్యమైంది. తాజాగా హైదరాబాద్ లో నిర్భయ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేయడంతో  నిర్భయ నిందితులకు ఉరిశిక్ష ఎప్పుడనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. 

దిశ నిందితుల  ఎన్ కౌంటర్ సమర్ధించిన నిర్భయ తల్లి ఆశాదేవి

దిశ హంతకుల ఎన్ కౌంటర్ పై  హర్షం వ్యక్తం చేశారు నిర్భయ తల్లి ఆశాదేవి. తాను ఏడేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నా ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు. తనకు పట్టిన గతి మరి ఎవరికీ రాకూడదన్నారు. దిశ తల్లిదండ్రులకు కేవలం పదిరోజుల్లో జరిగిందని..ఇందుకు హైదరాబాద్ పోలీసులకు అభినందనలు తెలిపారు. 

నేరస్థులకు సరైన శిక్ష పడిందన్న నిర్భయ తల్లి …తన కూతురి విషయంలో కూడా త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఉరి తీయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 

దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన కొద్దిరోజుల్లోనే నిర్భయ నిందితులకు ఉరి

దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన కొద్దిరోజుల్లోనే నిర్భయ నిందితులకు ఉరిశిక్ష ఖరారైంది. హైదరాబాద్ లో దిశ ఉదంతం. నిర్భయ దోషులు క్షమాభిక్ష కొట్టేయడం, రేపిస్ట్ లపై రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలతో త్వరలోనే నిర్భయ దోషుల్ని ఉరితీస్తారని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. 

తాజాగా రాష్ట్రపతి వ్యాఖ్యలకు ఆజ్యంపోసేలా నిర్భయ నిందితులకు ఉరిశిక్ష ఖరారైంది.  ఈనెల 16డిసెంబర్ ఉదయం 5గంటలకు తీహార్ జైల్లో నిందితుల్ని ఉరితీయనున్నరు. అందుకు తీహార్ జైల్ అధికారులు సన్నద్ధమవుతున్నారు.  

Latest Updates