రూ.లక్ష దాటిన నిర్భయ దోషుల జైలు సంపాదన

రూ.లక్ష దాటిన నిర్భయ దోషుల జైలు సంపాదనఢిల్లీలో నిర్భయపై రేప్ చేసి తీహార్ జైల్లో ఉంటున్నారు నలుగురు నిందితులు. జైల్లో ఉంటున్న ఈ నలుగురు పని చేసి వేలాది రూపాయలను సంపాదించారు. ఇందులో ముగ్గురి సంపాదన లక్షా 37 వేల రూపాయలు. ఈ నెల 22న వారిని ఉరితీయనున్నారు జైలు అధికారులు. అయితే వారు సంపాధించిన డబ్బును వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.

జైల్లో పని చేసిన సంపాధించిన సంపాదనలో దోషి ముఖేశ్ సింగ్ అందరికన్నా ఎక్కువగా రూ. 69 వేలు సంపాదించాడు. ఆ తర్వాత వినయ్ శర్మ రూ. 39 వేలు, పవన్ గుప్తా రూ. 29 వేలు సంపాదించారని జైలు అధికారులు తెలిపారు. అయితే అక్షయ్ కుమార్ మాత్రం కూలీ పనులు చేసేందుకు అంగీకరించక పోవడంతో ఎలాంటి వేతనమూ దక్కలేదు.

మరోవైపు దోషులను ఉరి తీసేందుకు ఏర్పాట్లను వేగవంతంగా చేస్తోంది జైలు సిబ్బంది.ఇందులో భాంగా నలుగురికీ పెడుతున్న భోజనాన్ని తగ్గించారు. అంతేకాదు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రత్యేక జైలు గదుల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచామన్నారు.

Latest Updates