నిర్భయ కేసు: ఉరితీసేందుకు అంత తొందరెందుకు

  • ఇంతకన్నా దారుణమైన కేసులు పెండింగ్ లో ఉన్నాయ్
  • ఈ కేసులో ఒత్తిడితోనే శిక్షలు వేసినట్లుంది
  • సాక్షిగా ఉన్న వ్యక్తి సూసైడ్ అనుమానాస్పదంగా ఉంది
  • అక్షయ్ కుమార్ సింగ్ తరఫు న్యాయవాది AP సింగ్

నిర్భయ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్ వేసిన రివ్యూ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ బొపన్న బెంచ్ వాదనలు వింటోంది. అక్షయ్ కుమార్ సింగ్ తరపున AP సింగ్ వాదనలు వినిపిస్తున్నారు. కేసుకు సంబంధించిన కొన్ని విషయాలను కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు. మీడియా, రాజకీయ, ప్రజల ఒత్తిడితోనే ఈ కేసులో శిక్షలు వేసినట్లుగా ఉందన్నారు ఏపీ సింగ్. రేయాన్ స్కూల్ ఘటనలోనూ ప్రజల ఒత్తిడితో తప్పు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న రామ్ సింగ్ సూసైడ్ అనుమానాస్పదంగా ఉందన్నారు ఏపీ సింగ్.

మరోవైపు ఉరి తీసేందుకు ఢిల్లీ సర్కార్ ఎందుకు తొందరపడుతుందో అర్ధం కావడం లేదని తెలిపారు. పొల్యూషన్ తో ఢిల్లీ ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిర్భయ ఘటన కన్నా దారుణమైన  కేసులు ఎన్నో పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు ఏపీ సింగ్.

ఈ కేసును నిన్న చీఫ్ జస్టిస్ SA బోబ్డే, జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ భానుమతిలు విచారించాల్సి ఉంది. అయితే అనూహ్యంగా విచారణ నుంచి చీఫ్ జస్టిస్ బోబ్డే తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతోనే తాను తప్పుకుంటున్నట్టు బోబ్డే చెప్పారు. తన సమీప బంధువు గతంలో ఇదే కేసులో నిర్భయ తల్లి తరపున వాదనలు వినిపించినందున విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు సీజేఐ చెప్పారు. కేసు విచారణకు  జస్టిస్ ఆర్ బానుమతి నేతృత్వంలో కొత్త బెంచ్ ఏర్పాటు చేశారు.

Latest Updates