నిర్భయ కేసు: క్షమాభిక్ష పిటిషన్ అప్పుడెందుకు వేయలేదు?

నిర్భయ గ్యాంగ్‌రేప్‌ నిందితుల క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. డెత్ వారెంట్ పై స్టే ఇవ్వాలంటూ నిర్భయ దోషి ముఖేష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఒక కోర్టు ఆర్డర్ ఇస్తే, మరో కోర్టుకు వచ్చి అడగడం కరెక్ట్ కాదని చెప్పింది. 2017లో ఉరిశిక్ష అమలు చేయాలని తీర్పు ఇస్తే ఇప్పటి వరకు క్షమాభిక్ష పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని దోషుల తరపు లాయర్ ను ప్రశ్నించింది ఢిల్లీ హైకోర్టు. తీర్పు ఇచ్చిన రోజు నుంచే టైం మొదలైందని ఎందుకు ఆలస్యం చేశారని అడిగింది. ప్రతి దోషికి ఒక్కో రూల్ ఉండదని క్లారిటీ ఇచ్చింది. డెత్ వారెంట్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తప్పనిసరి అయితే ఆ ఇష్యూను పటియాల హౌస్ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.

Nirbhaya gang-rape and murder case: Delhi govt recommends rejecting mercy plea of convict Mukesh

Latest Updates