
నిర్భయ దోషి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కేసుకు సంబంధించి శిక్షను అనుభవిస్తున్న వినయ్ శర్మ తీహార్ జైల్లో గోడకు తలను బాదుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించింది.
మరోవైపు నిర్భయ దోషులకు ఢిల్లీ పటియాలా కోర్టు ఇప్పటికే డెత్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు వారిని ఉరి తీయాలంటూ తీర్పునిచ్చింది. నలుగురినీ ఒకే సారి ఉరి తీయాలని తీహార్ జైలు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో వినయ్ ఆత్మహత్యాయత్నంతో ఉరిపై సందిగ్ధత నెలకొంది.