నిర్భయ దోషుల ఉరి.. మార్చిన తేదీ

నిర్భయ దోషుల ఉరిశిక్ష తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 1 వ తేదిన ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేస్తున్నట్టు ఢిల్లీ కోర్టు తెలిపింది. నలుగురు దోషులకు ఫ్రెష్ డెత్ వారెంట్ ను జారీ చేసింది.  అంతకు ముందు జనవరి 22 న ఉరి వేయాలని తీర్పిచ్చింది ఢిల్లీ కోర్టు. కాని దోషుల్లో ఒకరైన ముఖేష్ కుమార్ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్  కారణంగా ఆ తేదిన వేయాల్సిన ఉరి తాత్కాలికంగా నిలిచిపోయింది. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో కొత్త తేదీని ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. తీహార్ జైల్లోనే నలుగురు దోషులకు ఉరి ఉంటుందని కోర్టు తెలిపింది.

Latest Updates