నిర్భయ నిందితుల్లో చావు భయం.. సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్

నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లోనూ ఒకరైన వినయ్‌ శర్మ సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు.  ఏడేళ్ల క్రితం జరిగిన ఆ అత్యాచార సమయంలో వినయ్ వయస్సు 19 సంవత్సరాలు మాత్రమేని, అతని వయస్సు మరియు అతని సామాజిక, ఆర్థిక నేపథ్యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిందితుడి తరపు లాయర్ ఏ.పి.సింగ్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితం ఢిల్లీలోని పటియాలా కోర్టు నిర్భయ దోషులను జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని తీర్పు చెప్పింది. కోర్టు న్యాయమూర్తి డెత్ వారెంట్ జారీ చేయడంతో నిందితుల్లో భయంతో పాటు, బతకాలనే ఆశ కూడా పెరుగుతుంది. తీర్పు అమలుకు 12 రోజులే ఉండడంతో కేసు నుండి బయటపడే మార్గాలను వెతుకుతున్నారు.  అంతకు ముందు నిందితులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో వారికి మిగిలిన చివరి అవకాశం క్యూరేటివ్ పిటిషన్. న్యాయపరంగా ఏదైనా అవకాశం ఉండొచ్చని దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ  బుధవారం క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన ముఖేష్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌కుమార్‌ సింగ్‌ (31) ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు.

నిర్భయ నిందితుల్లో చావు భయం.. సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్

Latest Updates