నేను క్షమాభిక్ష కోరలేదు.. నిర్భయ దోషి

తన క్షమాభిక్ష పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాశాడు నిర్భయ దోషి వినయ్ శర్మ. కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపిన క్షమాభిక్ష పిటిషన్ తాను దాఖలు చేయలేదన్నాడు. ఆ పిటిషన్ లో తన సంతకం చేయలేదని..ఆ పిటిషన్ తో తనకు సంబంధం లేదన్నాడు. 2012 డిసెంబర్ లో జరిగిన నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ ఉరిశిక్షపై రాష్ట్రపతికి  క్షమాభిక్ష  పిటిషన్ పెట్టుకున్నాడు. వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించాలని  రాష్ట్రపతిని కోరినట్లు హోంశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అసలు తాను క్షమాభిక్ష పిిటిషన్ పెట్టుకోలేదన్నాడు దోషి వినయ్ శర్మ.

Latest Updates